
ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌తో పాటు మరో 22 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకార కార్యక్రమం ఎంతో అట్టహాసంగా ముగిసింది.అయితే ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు ఆనం రామానారాయణ రెడ్డి , కొలుసు పార్థసారథి ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యారు.
సోషల్ మీడియాలో వీరిద్దరి గురించి పెద్ద చర్చే నడుస్తుంది. వీరంత అదృష్టవంతులు మరొకరెవరూ లేరంటూ నెట్టింట కామెంట్లు పెడుతున్నారు. ఎందుకంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వీరిద్దరూ ఎమ్మెల్యేలుగా పని చేశారు. ఆనం రామనారాయణ రెడ్డి కుటుంబానికి నెల్లూరులో రాజకీయ పలుకుబడి బాగా ఉంది.
అయితే ఆయన్ని వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పక్కన పెట్టి ఓ యువ రాజకీయ వేత్తను ముందుకు తీసుకుని రావడంతో…ఆనంలో అసంతృప్తి ఏర్పడింది.దీంతో అక్కడ ఇమడలేక ఎన్నికల సమయంలో వైఎస్పార్సీపీ ఆనం బైబై చెప్పేసి.. తెలుగు దేశం పార్టీలో చేరి ఆత్మకూరులో టీడీపీ అభ్యర్ధిగా బరిలో నిలవడమే కాదు.. మంత్రి పదవిని కూడా దక్కించుకున్నారు.
ఇక మరో మంత్రి కొలుసు పార్థసారథి విషయం తీసుకుంటే ..ఆయన కూడా ఆనంలా లక్కీ అనే చెప్పుకొవచ్చు. నిజానికి కొలుసు పార్థసారథి రాజకీయ ప్రస్థానం చాలా సుదీర్ఘమైనది. 2019లో వైసీపీ తరుఫున నిలబడిన ఆయన పెనమలూరు ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ ఈసారి ఎన్నికల్లో కొలుసుకు జగన్ మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వడానికి నిరాకరించడంతో ఆయన కూడా ఆనం బాటలోనే టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు.
కొలుసు పార్థసారథి తాజాగా ఎమ్మెల్యేగా గెలవడంతో..చంద్రబాబు బాబు కేబినెట్‌లో మంత్రి పదవిలోకి వచ్చారు. వైఎస్పార్సీపీ నుంచి బయటకు వచ్చి ఎమ్మెల్యేలుగా గెలిచిన వీరిద్దరినీ ..ఇప్పుడు మంత్రి పదవులు చేపట్టడం ఏపీ రాజకీయాల్లో వీరి గురించి జోరుగా చర్చ జరుగుతోంది. లక్‌ను తొక్కి వచ్చి కొత్త ప్రభుత్వంలో మంత్రులయిపోయారంటూ సోషల్ మీడియా వ్యాప్తంగానూ చర్చలు నడుస్తున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE