హౌస్‌లో పోట్లాడుకున్న నబీల్, పృథ్వీ..

Nabeel And Prithvi Who Fought In The House, Who Fought In The House, Prithvi Who Fought In The House, Fight In The House, Avinash, Bigg Boss Telugu 8, Gangavva, Hariteja, Nabeel, Nikhil, Prerna, Prithvi, Rohini, Tasty Teja, Yashmi, Bigg Boss Elimination, Elimination In This Week,Bigg Boss Telugu 8, Bigg Boss Telugu Season 8, Bigg Boss 8, Bigg Boss Contestants, Bigg Boss Season 8, Movie News, Latest Bigg Boss News, Bigg Boss News Updates, Nagarjuna, Tollywood, Mango News, Mango News Telugu

బిగ్ బాస్ సీజన్ 8 హౌజ్‌లో ప్రస్తుతం పదో వారానికి సంబంధించి మెగా చీఫ్ టాస్క్ నడుస్తోంది. దీనిలో భాగంగా మెగా చీఫ్ అవ్వడానికి మూట ముఖ్యం అనే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఒక కేజ్‌లో మెగా చీఫ్ కంటెండర్స్ ఉంటే వారిలో ఎక్కువ మూటలు ఉన్నవాళ్లే ఎలిమినేట్ అవుతూ ఉంటారు. సపోర్ట్ చేయాలనుకున్న ఇంటి సభ్యులు ఇతర కంటెండర్స్ ఉన్న కేజ్‌లో మూటలు పడేస్తూ ఉండాలి. ఈ మూట ముఖ్యం టాస్క్ నవంబర్ 7 ఎపిసోడ్‌లో ప్రారంభమవడా..దీనిలో నబీల్ మెగా చీఫ్ టాస్క్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు.

బిగ్ బాస్ సీజన్ 8 నవంబర్ 8వ తేది ఎపిసోడ్‌లో కూడా ఈ మూట ముఖ్యం టాస్క్ కంటిన్యూ అయింది. దీనికి సంబంధించిన ప్రోమో వీడియోలో మొదట నబీల్, పృథ్వీ మాట్లాడుతూ..తనకు సపోర్ట్ చేసినవాళ్లు సపోర్ట్ అడుగుతున్నారని తాను. అటు వెళ్తున్నానని పృథ్వీతో నబీల్ చెప్పాడు.

“సపోర్ట్ అడుగు. నువ్ మాటిచ్చావ్. అది నీ డిపెండ్. కానీ తర్వాత వాళ్లు తన మీద డిపెండ్ అవుతారని పృథ్వీ అంటాడు. దానికి నో వర్రీస్ అని నబీల్ అంటే.. “నో వర్రీస్. ష్యూర్” అని పృథ్వీ అనగా. “ఐయామ్ సారీ” అని నబీల్ వెళ్లిపోయాడు. తర్వాత గౌతమ్, అవినాష్, రోహిణి, తేజ వాళ్లతో నబీల్ మాట్లాడటం చూపించారు.

బుస కొడతా ఇప్పుడు. కొడతా అన్నందుకైనా కొడతా బుస. చూడు ఆ బుస కొట్టుడు” అంటూ అచ్చం నాగు పాము బుస కొట్టినట్లు నాలుకను బయటకు లోపలకు అంటూ నబీల్ ఇమిటేట్ చేశాడు. అది చూసి రోహిణి వాళ్లు అంతా నవ్వేశారు. తర్వాత బజర్ మోగడంతో..అంతా అలర్ట్ అయి మూటలు పట్టుకుని తమకు మెగా చీఫ్ అవ్వాలని లేని కంటెండర్స్ కేజ్‌లో వేయడానికి ప్రయత్నాలు చేశారు.

ఇలా చాలా వరకు మూటలు నబీల్ పృథ్వీ కేజ్‌లో వేశాడు. అది చూసి నబీల్ అని పృథ్వీ అరుస్తాడు. ఈయన బ్లాక్ చేశాడని నిఖిల్ గురించి చెప్పాడు నబీల్. “చూసుకోని పెట్టు.. చూసుకోని పెట్టు.. తన మీద పెట్టొద్దంటూ తెగ ఫైర్ అవుతాడు పృథ్వీ. తర్వాత గంగవ్వను అలా తీసుకురావొద్దు అంటూ హరితేజ, యష్మీ, విష్ణుప్రియ ఆపడానికి ప్రయత్నించారు.

ఏవండి ఈవిడ గారు తీసుకొచ్చారు కదండీ అని టేస్టీ తేజ అనగా.. తర్వాత బజర్‌కు ముందు బుట్టను వెనుక అంటాడు” అని నబీల్ కెమెరాకు చెప్పాడు. దాంతో “అప్పుడెందుకు చెప్పలేదు.. నోరు రాలేదా.. నోరు రాలేదా” అంటూ చేతులతో సైగలు చేస్తూ పృథ్వీ దూసుకొచ్చాడు. దాంతో పృథ్వీ చెస్ట్‌పై చేయి వేసి ఆపుతూ నిఖిల్‌కు నబీల్ వివరణ ఇవ్వడానికి ట్రై చేస్తాడు.

అది చూసి మరింత రెచ్చిపోయిన పృథ్వీ నబీల్‌ను తోసేసాడు. “టచ్ ఎత్తేందుకు చేస్తున్నావ్.. టచ్ ఎందుకు చేస్తున్నావ్” అంటూ పృథ్వీ అరవడంతో.. ఇద్దరు తలలను పోట్లగిత్తల్లా పెట్టుకుని మరీ గొడవ పడ్డారు. మధ్యలో వచ్చిన అవినాష్‌ను జరుగు అని నబీల్ పక్కకు తోసేశాడు. అటు నుంచి పృథ్వీని ఆపడానికి నిఖిల్ ప్రయత్నించాడు.

తర్వాత యష్మీ కూడా పృథ్వీని ఆపడానికి ట్రై చేసినా కూడా ఇద్దరు మాత్రం ఏ మాత్రం తగ్గకుండా గొడవ పడ్డారు. వీళ్లేకాకుండా హౌజ్‌మేట్స్ కూడా వీరిని ఆపడానికి ప్రయత్నించినా నబీల్, పృథ్వీ ఆగకపోవడంతో.. నిఖిల్ వారిద్దరిని పక్కనే ఉండి చూస్తూ ఉండిపోతాడు.