బిగ్ బాస్ సీజన్ 8 లో నిఖిల్ టైటిల్ విన్నింగ్ రేస్లోకి వచ్చాడని అనుకున్న ప్రతీసారి సోనియా విషయంలో వీక్ అవుతూ కిందకు పడిపోతున్న విషయం తెలిసిందే. టాస్కుల విషయంలో నిఖిల్ కింగ్.. కానీ బిగ్ బాస్ టైటిల్ గెలిచే రేంజ్ కి రావడానికి టాస్కులు ఆడడం ఒక్కటే కాదు.. అన్ని విషయాల్లోనూ జనాలకు నచ్చాలి. కానీ నిఖిల్ సోనియాతో సావాసం చేసి కన్నింగ్ గా తయారు అవుతున్నాడన్న టాక్ నడుస్తోంది. ప్రారంభం లో నిఖిల్ ని హౌస్ మేట్స్ అందరూ ఇష్టపడేవారు.. కానీ ఇప్పుడు మాత్రం అతని క్లాన్ లోకి రావడానికి ఎవ్వరూ ఇష్టపడలేదు. మొదటి నుండి నిఖిల్ సోనియా, పృథ్వీ రాజ్ తో ప్రయాణించడం వల్ల వాళ్ళు మాత్రమే ఆ క్లాన్ లోకి వెళ్లారు.
‘కాంతారా’ క్లాన్ నిండిపోవడంతో ప్రేరణని బిగ్ బాస్ ‘శక్తి’ క్లాన్ లోకి వెళ్లమంటాడు, కానీ ప్రేరణ.. అమ్మో!..వాళ్ళ క్లాన్ లోకి వెళ్లి నేను తట్టుకోలేనని మనసులో అనుకుంటుంది. తాను వెళ్ళలేనని, తన పేరు చివర్లో పిలవమంటుంది.. అప్పుడు ఛాయస్ తనది అవుతుంది కాబట్టి తాను కాంతారా టీం లోకి వెళ్తానని అంటుంది. చివరికి మణికంఠ కూడా నిఖిల్ క్లాన్ లోకి వెళ్లాలనుకోడు. తాను కాంతారా టీం లోకి వెళ్తాను, ఎవరైనా ఆ క్లాన్ లో షిఫ్ట్ అవ్వండని రిక్వెస్ట్ చేసినా, ఎవ్వరు ఒప్పుకోరు, దీంతో మణికంఠ అయిష్టంగానే నిఖిల్ క్లాన్ లోకి వెళ్తాడు.
ఇలా నిఖిల్ క్లాన్ అంటేనే హౌస్ మేట్స్ భయపడి పారిపోవడానికి కారణం సోనియా అంటున్నారు బిగ్ బాస్ ఫ్యాన్స్. పేరుకి నిఖిల్ చీఫ్ కానీ, ఆ క్లాన్ లో ఆయన సోనియా చేతిలో ఆట బొమ్మ అన్న ఫీలింగ్ అందరిలోనూ వచ్చేసింది. ఆమె ఏది చెప్తే అదే నిఖిల్ చేయాలన్నట్లుగా ఉంటుంది. మణికంఠ ని ‘సర్వైవల్ ఆఫ్ ది ఫిట్నెస్’ టాస్కులో తప్పించావంటే నిఖిల్ కి ఒక గంటసేపు క్లాస్ పీకుతోంది సోనియా. ఇది టెలికాస్ట్ లో చూపించలేదు కానీ.. లైవ్ లో మాత్రం చూపిస్తారు. సోనియా నిఖిల్ తో మాట్లాడుతూ ..యష్మీ ని తొలగించమని సిగ్నల్స్ కూడా ఇచ్చాను కదా, ఎందుకు తొలగించలేదు, మణికంఠని ఎందుకు తొలగించావని అంటుంది.
అప్పుడు నిఖిల్ ‘నా మనసులో కూడా యష్మీ పేరునే చెప్పాలని ఉంది. కానీ మణికంఠ నే గేమ్ నుంచి తప్పుకుంటానని చెప్పాడు, ఇక నేనేం చేయగలనని సమాధానమిస్తాడు. ఆ తర్వాత యష్మీని తమ క్లాన్ నుంచి ఎలా తప్పించాలనే దానిపై ఇద్దరూ చర్చించుకున్నారు. చూడటానికి మంచోడులా కనిపించే నిఖిల్ కూడా కన్నింగ్ ఆలోచనలు చేస్తుండడం చూసి నిఖిల్ ఫ్యాన్స్ కూడా షాక్ అవుతున్నారు. మొత్తంగా సోనియా నిఖిల్ ను మ్యానిప్యులేట్ చేస్తుందని..అతని తీరు ఇలాగే కొనసాగితే నిఖిల్ కి ఓట్లు వేయడం ఆపేస్తామంటూ సోషల్ మీడియా లో పోస్టులు పెడుతున్నారు.