బిగ్‌బాస్ సీజన్ 8 లో ఎనిమిదో వారం ఎవరూ ఊహించని విధంగా మెహబూబ్ ఎలిమినేట్ అయ్యాడు. అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన మెహబూబ్.. ఏదో ఉన్నానంటే ఉన్నాను అన్నట్లు ప్రవర్తించాడన్న కామెంట్లు ఎక్కువగా వినిపించాయి. హౌస్ మేట్స్ నే కాదు.. ఆడియన్స్ ను కూడా పెద్దగా ఇంప్రెస్ చేయలేదు.
ఓటింగ్ లో లీస్టులో ఉన్న నయని, మెహబూబ్ లో ..అతి తక్కువ ఓట్లు పడి చివరకు మెహబూబ్ ఎలిమినేట్ అయిపోయాడు. అయితే అదే టైంలో అవినాష్ కూడా సెల్ఫ్ ఎలిమినేట్ అయినట్లు ఆదివారం ఎపిసోడ్ చివరలో చూపించడంతో అంతా షాక్ అయ్యారు. మెహబూబ్ ఎలిమినేట్ అయి వెళ్లిన తర్వాత.. బెడ్రూంలోకి వచ్చిన అవినాష్ అందరి దగ్గరకూ వచ్చి రిపోర్ట్ వచ్చింది. కడుపులో ఏదో సమస్యగా ఉంది. మీకు కష్టం అవుతుంది. బయటకు వచ్చేసేయండి అని డాక్టర్స్ చెప్పారని చెబుతాడు
ఏది పడితే చెప్పకు.. నీ భార్య మీద ఒట్టేసి చెప్పు అని అవినాష్ ను నిఖిల్ అడిగేసరికి.. ఫొటోపై ఒట్టేసి మరీ నిజంగానే వెళ్లిపోతున్నా అని అవినాష్ చెబుతాడు. నాపై ఒట్టేసి నిజం చెప్పమని నయని పావని అడిగినప్పుడు కూడా అవినాష్ అదే విషయాన్ని చెబుతాడు. నొప్పి తట్టుకోలేకపోతున్నా’ అని ఏడ్వడంతో.. హౌస్‌లో అందరూ అతడిని ఓదారుస్తూ కన్నీళ్లు పెట్టుకుంటారు.
అయితే ఇదంతా ప్రాంక్‌లో భాగంగానే అవినాష్ చేశాడని.. తర్వాత రిలీజయిన ప్రోమోలో బయటకు వచ్చింది. సోమవారం ఎపిసోడ్‌తో ఈ విషయంపై పూర్తి క్లారిటీ వస్తుంది. 24 గంటల స్ట్రీమింగ్ వల్ల.. అవినాష్ తిరిగి హౌస్ లోకి వచ్చిన వీడియోలని నెటిజన్లు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. సెల్ఫ్ ఎలిమినేట్ అని చెప్పిన అవినాష్.. ప్రాంక్ చేయడం బాగుంది కానీ మరీ భార్య మీద, నయని మీద ఒట్టేసి మరీ అబద్ధాలు చెప్పడం ఎందుకని కొంతమంది ప్రశ్నిస్తున్నారు.