వయాగ్రా టాబ్లెట్‌ను చాలామంది మగవాళ్లు తమ శృంగార సామర్ధ్యాన్ని పెంచుకోవడంలో వాడతారు. ప్రపంచవ్యాప్తంగా ఈ టాబ్లెట్‌ను తయారు చేస్తారు. వయాగ్రా నీలి వజ్రం ఆకారంలో ఉంటుంది. మొదట్లో దీనిని అధిక రక్తపోటు, ఆంజినా పెక్టోరిస్ చికిత్సకు ఉపయోగించేవాళ్లు.తర్వాతతర్వాత పిల్ రక్త ప్రసరణను పెంచడం ద్వారా జననేంద్రియ ప్రాంతంలో ఒత్తిడిని పెంచుతుందన్న విషయం తేలడవంతో దీనిని శృంగారంలో వాడే మందుగానే ఉపయోగిస్తున్నారు. వయాగ్రాలో సిల్డెనాఫిల్ అనే మందు ఉంటుంది. అయితే వయాగ్రాను ఎలా పడితే అలా.. ఎప్పుడు పడితే అప్పుడు తీసుకోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వయాగ్రాను భోజనానికి అరగంట ముందు లేదా భోజనం చేసిన 2 గంటల తర్వాత తీసుకోవడం మంచిది. అది కూడా డాక్టర్ సలహాతో మాత్రమే వాడాలి. వయాగ్రా ప్రభావం సుమారు 4 నుంచి 5 గంటల పాటు ఉంటుంది. వయాగ్రాను పురుషులు మాత్రమే ఉపయోగించాలి. వయాగ్రాను వేరేవాటితో తీసుకోకూడదని..కేవలం నీళ్లతో పాటే టాబ్లెట్ వేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మద్యంతో వయాగ్రా తీసుకోకూడదు.
సెక్స్ లైఫ్ ఆనందాన్నిపెంచడానికి అందరూ వయాగ్రా తీసుకోవాలనుకుంటే కుదరదు. ఎందుకంటే కొంతమందిలో దీని వల్ల కొన్ని సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుందట. వయాగ్రాలో సిల్డెనాఫిల్ ఉండటం వల్ల.. సిల్డెనాఫిల్ లేదా ఇతర ఔషధాలు తీసుకుంటే అలర్జీ ఉన్న వ్యక్తులు వయాగ్రాను అస్సలు తీసుకోకూడదు. ఛాతీ నొప్పికి నైట్రేట్ మందులు వాడే వాళ్లూ వయాగ్రానుమ తీసుకోకూడదు. గుండె కాలేయ వ్యాధి ఉన్నవాళ్లు, స్ట్రోక్, గుండెపోటుతో బాధపడుతున్న పురుషులు వయాగ్రా టాబ్లెట్స్ జోలికి వెళ్లకూడదు.
అలాగే తక్కువ రక్తపోటు ఉన్న రోగులకు కూటా వయాగ్రా మంచిది కాదు. అంతేకాకుండా అరుదైన జన్యుపరమైన కంటి వ్యాధులున్నవారు.. లుకేమియా, మల్టిపుల్ మైలోమా వంటి రక్త క్యాన్సర్‌లు ఉన్న రోగులు వయాగ్రాకు దూరంగా ఉండాలి. అలాగే, జననేంద్రియ వైకల్యాలున్న వ్యక్తులు మరియు కడుపు పూతలతో బాధపడుతున్నవాళ్లు కూడా వయాగ్రాను తీసుకోవడం అస్సలు మంచిది కాదు. రక్తస్రావం వంటి సమస్యలతో బాధపడే పురుషులు వయాగ్రాకు దూరంగా ఉండాలి.
కొంతమందిలో వయాగ్రా తీసుకున్న తర్వాత తలనొప్పి, వికారం, అజీర్ణం, చలి, తల తిరగడం వంటి సమస్యలను ఫేస్ చేస్తారు. కొద్దిగా ఉంటే పర్వలేదు కానీ.. సమస్య పెరుగుతున్నట్లు అనిపిస్తే మాత్రం వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది. అయితే వయాగ్రాను ఉపయోగించడం వల్ల శృంగార సామర్ధ్యం పెరగడంతో పాటు.. జ్ఞాపకశక్తి మెరుగుపడుతుదని కొన్ని అధ్యయనాలు తేల్చాయి.