విన్నర్ రేసులో రోహిణి.. తారుమారవతున్న బిగ్ బాస్ ఓటింగ్

Rohini In The Winner's Race

బిగ్ బాస్ సీజన్ 8 మరికొద్ది రోజుల్లో ముగియబోతోంది. అయితే 13వ వారం అయిన ఈ వారం ..ఎవరు ఎలిమినేట్ అవుతారు..అలాగే ఈ సీజన్ టైటిల్ కొట్టేది ఎవరు అంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో చర్చ జోరుగా సాగుతోంది.

వైల్డ్ కార్డుతో ఎంట్రీ ఇచ్చిన గౌతమ్ కృష్ణ.. మొదటి వారమేనామినేషన్స్‌లోకి వచ్చి ఎలిమినేట్ అవ్వాల్సి ఉండగా.. మణికంఠ సెల్ఫ్ ఎలిమినేట్ అవ్వడంతో సేవ్ అవుతాడు. తనకి వచ్చిన ఈ సెకండ్ ఛాన్స్ ను వినియోగించుకుంటూ గౌతమ్ తన గేమ్ మొత్తాన్ని మార్చుకొని,వేరే లెవెల్ ఇంప్రూవ్మెంట్ ని చూపించడంతో ఇప్పుడు టైటిల్ విన్నర్ గౌతమ్ అవుతాడా అన్న వార్తలు వినిపిస్తున్నాయి.

ఇంతకు ముందు సీజన్స్ లో బిగ్ బాస్ టైటిల్ ఎవరు గెలవబోతున్నారనేది, 7,8 వారాలు తర్వాత ఒక అంచనా వచ్చేసేది. కానీ ఈ సీజన్ లో టైటిల్ ఎవరు గెలవబోతున్నారనేది 13 వారాలు పూర్తయినా కూడా కనిపెట్టలేకపోతున్నారు.ఎందుకంటే ఈ సీజన్ లో కంటెస్టెంట్స్ కి ప్రతీ వారం ఓటింగ్‌లో వస్తున్న గ్రాఫులు చూసి బిగ్ బాస్ టీమే ఆశ్చర్యపోతోంది. వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ కి ముందు నిఖిల్, నబీల్‌లో ఎవరో ఒకరు టైటిల్ కొడుతారని అనుకున్నారు. కానీ వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత.. అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి.

నామినేషన్స్ లోకి వచ్చి మొదటి వారమే ఎలిమినేట్ అవ్వాల్సిన గౌతమ్ ..టాప్ 5 లో ఉండడం కాదు, ఏకంగా టైటిల్ రేస్లోకి దూసుకొచ్చాడు. ఇప్పుడు టైటిల్ రేస్ లో కేవలం గౌతమ్, నిఖిల్‌తో పాటు..రోహిణి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. లాస్ట్ వీక్ రోహిణి టాస్కులు మామూలు రేంజ్ లో ఆడలేదు. గత వారం టాస్కులలో బిగ్ బాస్ హిస్టరీ లోనే ఒక రికార్డ్ క్రియేట్ చేసింది.దీంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఈమెకి ఒక రేంజ్ లో కనెక్ట్ అయ్యారు.

కళ్ళు మూసుకొని ఓట్లు వేసేస్తున్నారా అన్నట్లు గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. నబీల్ స్థానాన్ని ఆమె ఆక్రమించేసుకుంది. ఇప్పుడు నబీల్ టాప్ 5 లో అయినా ఉంటాడా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ వారం టికెట్ టు ఫినాలే ఎవరైనా గెలిచి.. టాప్ 5 లోకి వెళ్తే మాత్రం నబీల్ రిస్క్ లో పడినట్టే. ఇటు ప్రేరణకి కూడా నబీల్ కంటే ఎక్కువ ఓట్లు పడుతున్నాయి. వారం వారం మారుతున్న గ్రాఫ్ తో అసలు విజేత ఎవరో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.