బిగ్‌బాస్ సీజన్ 8లో భాగంగా.. మరో రెండ్రోజుల్లో 12వ వారం అయిపోతుంది. మరికొద్ది వారాల్లో ఈ రియాలిటీ షోకు ఎండ్ కార్డ్ పడబోతుంది. గత వారం ఎవరూ ఎలిమినేషన్ కాకపోవడంతో 12వ వారం ఎవరు హౌస్‌ను వీడనున్నారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ వారం ఇద్దరు ఇంటి సభ్యులు బయటకు వెళ్లనున్నారన్న వార్త వినిపిస్తుంది.
తాజాగా మెగా చీఫ్ టాస్క్‌లో టేస్టీ తేజ విజయం సాధించగా.. ఇప్పుడు ఆటో గేమ్ అనే మరో గేమ్ పెట్టాడు బిగ్‌బాస్. ఆటో ఎక్కి చివరి వరకు దానిలో ఎవరుంటారో వాళ్లే గెలిచినట్లు అని బిగ్ బాస్ చెబుతాడు. ముందుగా తేజ, రోహిణి, యష్మి కిందపడిపోయారు. ఈ గేమ్‌లో రోహిణి, విష్ణుప్రియల మధ్య గొడవ జరగగా.. ఇన్ని రోజులు విష్ణుప్రియ హౌస్‌లో ఉన్నది వేరే దాని వల్ల అంటూ రోహిణి రెచ్చగొట్టింది. ఫస్ట్ నిఖిల్‌కి ట్రై చేసిందని..తర్వాత పృథ్వీకి ట్రై చేసిందంటూ విష్ణు బండారాన్ని బయటపెట్టింది. మొత్తానికి ఒక్కొక్కరిని ఆటోలో నుంచి తోసేసి..చివరకు పృథ్వీ ఎక్కువ పాయింట్లు సాధించాడు.
ఇక మెగా చీఫ్ ఎవరో తేల్చడానికి చివరిగా కుండ జాగ్రత్త అనే టాస్క్ పెట్టాడు బిగ్‌బాస్. దీనిలో రోహిణి, పృథ్వీ, తేజ ఆడారు. ఈ గేమ్‌లో.. సీసా మీద కంటెస్టెంట్ నిలబడగా అవతలి వైపున కుండ పెడతారు. బజర్ మోగినప్పుడల్లా.. ప్రత్యర్ధి కంటెస్టెంట్ కుండలో ఇసుక పోయాలి. దీనిలో ముందే తేజ పడిపోగా పృథ్వీ, రోహిణి హోరాహోరీగా తలపడ్డారు. కానీ పృథ్వీ చివరికి చేతులెత్తేయగా.. రోహిణి మెగా చీఫ్ అయ్యింది. ఈ సీజన్‌కే లాస్ట్ మెగా చీఫ్‌గా రోహిణి రికార్డ్ సృష్టించింది.
రోహిణి గెలవడంతో.. అంతా కలిసి ఆమెను మెగా చీఫ్ గద్దెపై కూర్చోబెట్టారు. అయితే ఈ సీజన్‌లో ఒక్కసారి కూడా మెగా చీఫ్ కాలేకపోయామని పృథ్వీ, టేస్టీ తేజ బాధపడుతుండగా.. మిగిలిన కంటెస్టెంట్స్ వారిని ఓదార్చుతారు.అయితే పృథ్వీ ఆటతీరును మెచ్చుకుంటూ బిగ్‌బాస్ కూడా నాలుగు మాటలు చెప్పాడు. మొత్తానికి జీరో అని అందరితో పిలిపించుకున్న రోహిణి..ఈ సీజన్‌కు ఆఖరి మెగా చీఫ్‌గా నిలిచి గ్రేట్ అనిపించుకుంది.
మొత్తంగా 12వ వీక్ నామినేషన్స్‌లో నబీల్, యష్మి, పృథ్వీరాజ్,నిఖిల్,ప్రేరణ ఐదుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. అయితే ప్రేరణ, నిఖిల్ 24 శాతం ఓటింగ్‌తో టాప్ ప్లేస్‌లో నిలిచారు. తర్వాత యష్మి గౌడ 18 శాతం ఓటింగ్‌తో సేఫ్ జోన్‌లో నిలిచారు. నబీల్ 16 శాతం ఓటింగ్ తో.. పృథ్వీరాజ్ శెట్టి 14 శాతం ఓటింగ్‌తో డేంజర్ జోన్‌లో ఉన్నారు. ఇక సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం ఈ వారం ఇద్దరు స్ట్రాంగ్ ప్లేయర్లు హౌస్‌ను వీడనున్నట్లు తెలుస్తుంది. అయితే దీనిలో ఎంత నిజం ఉందో తెలియాలంటే మరి కొద్దిగంటలు వెయిట్ చేయాలి.