ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ లో చూడగానే ఈ అమ్మాయి బాగుంది అని అనిపించిన వారిలో ఒకరు సోనియా ఆకుల. ఈమె హౌస్ లోకి అడుగుపెట్టకముందు చాలామంది ఆడియన్స్ కి అసలు పరిచయమే లేదు.రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన కరోనా వైరస్ అనే సినిమాలో ఈమె హీరోయిన్ గా చేసింది. కానీ ఆ సినిమా ఎప్పుడు వచ్చిందో, ఎప్పుడు వెళ్లిందో కూడా ఆడియన్స్ కి తెలియదు. కానీ బయట ఈమె ఒక ఎన్జీఓ సంస్థని నడుపుతూ ఎన్నో కార్యక్రమాలు చేసిందని షోకి వచ్చాకే తెలిసింది.
హౌస్ లోకి అడుగుపెట్టిన ఈమెని చూసి చక్కగా ఉందని అనుకున్న ఆడియన్స్.. ఆమె విశ్వరూపం చూసాక చేతులెత్తి దండం పెట్టేస్తున్నారట. విష్ణు ప్రియ డ్రెస్ మీద కామెంట్స్ చేయడం, ఆమె క్యారక్టర్ ని తక్కువ చేస్తూ మాట్లాడడం, ఆమె తల్లిదండ్రులపై కామెంట్స్ చేయడం, ఇలాంటివి ఎన్నో చూసిన ఆడియన్స్ సోనియాపై నెగిటివిటీని పెంచుకుంటున్నారట. విష్ణు ప్రియని అడల్ట్ రేటెడ్ కామెడీ అని సంబోధించిన సోనియా, నిఖిల్, పృథ్వీ రాజ్ తో హగ్గులు ఇస్తూ క్లోజ్ గా తిరగడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అక్క రూల్స్ మాట్లాడుతాది కానీ, అనుసరించదంటూ సోషల్ మీడియాలలో ఈమెపై బోలెడన్ని ట్రోల్స్ కూడా వచ్చాయి.
ఇదంతా పక్కన పెడితే అందరినీ ఏడిపించే యష్మీని కూడా సోనియా తాజాగా జరిగిన నామినేషన్స్ లో ఏడిపించేసింది . ఎందుకంటే యష్మీ సోనియాని తన స్నేహితురాలిగా అనుకుంటూ వచ్చింది. ఆమె క్లాన్ లో ఉన్నప్పుడు సోనియాతో క్లోజ్‌గానే మూవ్ అయ్యేది. అలా మంచి రిలేషన్ ఉంది అని అనుకునేలోపు యష్మీ ని సోనియా నామినేట్ చేయడంతో వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసింది. అంతే కాకుండా విష్ణు ప్రియా డ్రెస్సింగ్ పై సోనియా ఎలాంటి కామెంట్స్ చేసిందో, యష్మీ బట్టలపై కూడా ఆమె అలాంటి కామెంట్సే చేయడంతో… వీటిని యష్మీ తీసుకోలేకపోయింది.
ముందుగా యష్మీ మాట్లాడుతూ ఫస్ట్ వారం నన్ను లక్ ఫ్యాక్టర్ తో చీఫ్ అయ్యాను అని అన్నారని.. అప్పట్లో ఈ కామెంట్స్ పై మన మధ్య పెద్ద గొడవ జరిగిందని గుర్తు చేసింది. నేనేమి లక్ తో గెలవలేదని. మొదటి టాస్క్ నిఖిల్ తో కలిసి ఆడి గెలిచానని అన్నారు, అందుకే మాకు రెండవ సారి చీఫ్ టాస్కులు ఆడే అవకాశం వచ్చిందని. మీలాగా తేలికగా తీసుకొని టాస్కుని వదిలేయలేదని అంది. దీనికి సోనియా కౌంటర్ ఇస్తూ ఎవరు గేమ్ ని తేలికగా తీసుకున్నారు.. టాస్కు కోసం డ్రెస్ ని మార్చుకోమని చెప్తే నువ్వు తేలికగా వదిలేసావని సమాధానమిస్తూ.., నువ్వు తేలికగా తీసుకున్నావా?, లేదా నేనా?’ అని కౌంటర్ ఇచ్చింది. అప్పుడు యష్మీ నాకు ఏది కంఫర్ట్ గా అనిపిస్తే ఆ డ్రెస్ వేసుకుంటాను మీకెందుకు అంటూ సమాధానం ఇవ్వడంతో వీళ్లిద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. ఈ సమయంలో యాష్మి కన్నీళ్లు పెట్టుకుంది.