బేబక్క అవుట్..మణికంఠ సేవ్

Sympathy Who Worked Out Manikantha Save, Manikantha Save, Manikantha Sympathy Worked Out, Beybakka Is Out, Bigg Boss, Manikantha Save, Nagarjuna, Nikhil, Sania, Season, Vishnupriya, Bigg Boss, Bigg Boss Telugu Season 8, Bigg Boss 8, Bigg Boss Contestants, Bigg Boss Season 8, Movie News, Latest Bigg Boss News, Bigg Boss News Updates, Nagarjuna, Tollywood, Mango News, Mango News Telugu

బిగ్ బాస్ సీజన్ 8 రసవత్తరంగా సాగుతోంది. నిన్నటి ఎపిసోడ్ లో ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వడంతో హౌస్ లో ఇప్పుడు 13 మంది హౌస్ మేట్స్ ఉన్నారు. ఆదివారం రోజు జరిగిన ఎపిసోడ్లో హోస్ట్ నాగార్జున హౌస్ మేట్స్‌తో సందడి చేసి.. గేమ్స్ ఆడించి అలరించారు. చివరిలో ఎలిమేషన్‌తో కాస్తంత టెన్షన్ పెట్టారు.

గత వారం నామినేషన్స్ లో విష్ణు ప్రియ, సోనియా, శేఖర్ బాషా, నాగ మణికంఠ, పృథ్వీ, బెజవాడ బేబక్క ఉండగా ఒకొక్కరూ సేవ్ అవుతూ వచ్చారు. శనివారం సోనియాని సేవ్ చేయగా.. ఆదివారం ఎపిసోడ్ లో ముందుగా శేఖర్ బాషా‌ని.. తరువాత పృథ్వీ, విష్ణు ప్రియలను సేవ్ చేశారు. చివరికిగా నాగ మణికంఠ, బేబక్కలు మిగలగా..వీరిద్దరిలో నాగ మణికంఠను సేవ్ చేసి బెజవాడ బేబక్కను ఎలిమినేట్ చేశారు.

అయితే నాగమణికంఠ వెళ్లిపోతాడని చాలా మంది అనుకున్నారు. కానీ చివరిలో ఊహించని విధంగా బేబక్కను ఎలిమినేట్ చేసి అందరికి షాక్ ఇచ్చారు. బిగ్ బాగస్ హౌస్ లో కూడా అభయ్ నవీన్, శేఖర్ బాషా, సోనియా మిగిలినవారు మణికంఠ ఎలిమినేట్ అవుతాడని గట్టిగా ఫిక్స్ అయ్యారు.. చివరి వరకు మణికంఠ కూడా చాలా టెన్షన్ పడ్డాడు. కానీ సీన్ రివర్స్ అయి సేవ్ అయ్యాడు.

బేబక్క ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్లాక.. మణికంఠ హౌస్‌లోకి వెళ్లగానే అభయ్ ప్లేటు మార్చేసి అతన్ని హగ్ చేసుకున్నాడు. ఆదిత్య ఓం మణికంఠను ముద్దు పెట్టుకుని.. అతని చెవిలో చెప్పాను కదా నిన్ను జనం సేవ్ చేస్తారని చెప్పాడు. దానికి మణికంఠ థాంక్స్ అన్నా అన్నాడు.

మరోవైపు నేను ఇంత త్వరగా వస్తానని అనుకోలేదు బాధగా ఉంది సార్ అని బేబక్క ఎమోషనల్ అయ్యింది. దానికి నాగార్జున ఓటింగ్ అనేది జనం చేతుల్లో ఉందని చెప్పి.. బేబక్క జర్నీ చూపించారు. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్‌లో ఉండటానికి అర్హత లేని వాళ్లని రోడ్డుపై పడెయ్ అంటూ ఓ టాస్క్ ఇచ్చాడు నాగార్జున.

ముందుగా సోనియాని రోడ్డున పడేసిన బేబక్క..ఆ తర్వాత పృథ్వీని, నిఖిల్‌ని,రోడ్డున పడేసింది. ఒకొక్కరి గురించి బేబక్క చెప్తుంటే కిరాక్ సీత చాలా ఎమోషనల్ అయ్యి.. తెగ ఏడ్చేసింది. నిఖిల్ చెప్పినట్టే చేశానని.. అతని వల్లే నేను ఎలిమినేట్ అయ్యానని బేబక్క చెప్పడంతో..దానికి నిఖిల్ కూడా సారీ చెప్పడంతో ఎపిసోడ్ ఎండ్ అయింది.