బిగ్ బాస్ సీజన్ 8లో.. తోటి కంటెస్టెంట్స్‌తో పాటు ఆడియన్స్‌ని కూడా బాగా ఎంటర్టైన్ చేసిన టేస్టీ తేజ ఈ వారం ఎలిమినేట్ అయిపోయాడు.గత సీజన్ లో టేస్టీ తేజ టాస్కులు పెద్దగా ఆడకపోయినా.. ఈ సీజన్ లో మాత్రం ఎంటర్టైన్మెంట్ తో పాటు, టాస్కులు అద్భుతంగా ఆడాడు. కేవలం ఫిజికల్ టాస్కుల్లోనే కాదు..తెలివితేటలు ఉపయోగించి ఆడే టాస్కుల్లో కూడా టేస్టీ తేజా గెలిచాడు.
అయితే ఈ వీక్ మాత్రం టేస్టీ తేజకి బాగా నెగిటివ్ అయ్యిందనే చెప్పాలి. టాస్కులు ఆడటానికి ప్రయత్నం చేసినా.. ఒక్క టాస్కు కూడా గెలవలేదు. అంతేకాదు బ్రిడ్జ్ టాస్క్ లో తను ఓడిపోవడానికి కారణం గౌతమ్ అని అతని వైపు నెట్టడంతో చాలామందిలో నెగిటివ్ ఇంప్రెషన్ తెచ్చుకున్నాడు.
గౌతమ్ కావాలనే తను సోలో బాయ్ అని నిరూపించుకోవడానికి తనను ఎదవని చేసాడు అంటూ చెప్పే ప్రయత్నం చేయడం అతనికే మైనస్ అయింది. దీంతో ఈ వారం మొదటి రోజు నుండే ఓటింగ్ లైన్ లో అందరికంటే టేస్టీ తేజాకే తక్కువ ఓట్లు పడ్డాయి. కచ్చితంగా ఇతను ఎలిమినేట్ అవుతాడని అందరికి తెలిసిపోయింది. కనీసం ఈ వారం టాస్కులు కూడా తేజాకు ప్లస్ అవకపోవడం వల్ల ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది.
అయితే టేస్టీ తేజాకి ఈసారి రెమ్యూనరేషన్ మాత్రం గట్టిగానే సంపాదించాడట. బిగ్ బాస్ టీం తేజాకు వారానికి రెండు లక్షల రూపాయిలు ఇవ్వడానికి ఒప్పుకున్నారట. దీంతో 8 వారాలు హౌస్ లో ఉన్న తేజకు 16 లక్షల రూపాయిలు వచ్చినట్లు అయింది. అయితే సీజన్ 7 లో వచ్చిన ఫేమ్ తోనే తేజా పెద్ద పెద్ద వ్యాపారాలు పెట్టుకున్నాడు. యూట్యూబ్ ఛానల్ కూడా బాగా డెవలప్ చేసుకున్నాడు.
ఇక సీజన్ 8లో తేజా డబ్బులతో పాటు, ఆడియన్స్ లోనూ బాగానే మార్కులు సంపాదించుకున్నాడు.దీనిని ప్లస్ గా మార్చుకోవడంలో తేజ ముందే ఉంటాడని ఆయన అభిమానులు అంటున్నారు. మరి చూడాలి ఈ సీజన్ తేజాకు ఎలాంటి లక్‌ను తెచ్చిపెడుతుందో . కాగా ఈ రోజు తేజ ఎలిమినేట్ అవగా..ఆదివారం మరో కంటెస్టెంట్ బయటకు వస్తారన్న టాక్ నడుస్తోంది.