పూర్తిస్థాయిలో టీకాలు వేయించుకోకపోవడమే కారణం?

Thousands Of Deaths Is It Because Of Not Being Fully Vaccinated, Not Being Fully Vaccinated, Thousands Of Deaths Fully Vaccinated, Covid ,Thousands Of Deaths, Not Being Fully Vaccinated, Covid Vaccinated, Covid, Covid Cases, 2024 Covid Cases, Covid Vaccine, Latest Covid News, Covid News Updates, Health News, Mango News, Mango News Telugu
Covid ,Thousands of deaths,not being fully vaccinated,Covid vaccinated

డాక్టర్లు సూచించినట్లుగా కొవిడ్‌ టీకా డోసులు తీసుకోకపోయినా కూడా మరణాల ముప్పు పొంచి ఉంటుందని యూకే  అధ్యయనం తేల్చింది. వైద్యులు సూచించినట్లుగా టీకాలు తీసుకుంటే.. 2022 వేసవి సీజన్‌లోనే సుమారు 7,000కుపైగా మరణాలు లేదా ఆస్పత్రుల్లో చేరడాన్ని నివారించే వారని అధ్యయంన తేల్చింది. ఈ అధ్యయనాన్ని ‘ది లాన్సెట్‌’ ప్రచురించింది.

జనవరి 2022 నాటికి యూకేలో 12 ఏళ్లు దాటిన వారిలో 90 శాతం వరకూ మొదటి డోసు టీకా తీసుకున్నారు. కానీ, ఆ తర్వాత రెండో డోసు, బూస్టర్ డోసులు తీసుకున్నవారి శాతం గణనీయంగా తగ్గిపోయినట్లు అధ్యయన కర్తలు చెప్పారు . జూన్‌ 2022 కల్లా యూపీలో మొత్తం జనాభాలో కేవలం 44 శాతం మంది మాత్రమే పూర్తి స్థాయి డోసులు, బూస్టర్లు తీసుకున్నారు. అయితే ఈ డోసులను పూర్తి స్థాయిలో వీటిని తీసుకొని ఉంటే.. ఆ సీజన్లో కనీసం 7,000 వేల మంది చనిపోవడాన్ని లేదా ఆస్పత్రుల్లో చేరికలను నివారించే వారమని అధ్యయనకర్తలు వెల్లడించారు. ఈ అధ్యయనాన్ని హెల్త్‌ డేటా రీసెర్చి యూకే  ఎడిన్‌బర్గ్‌ విశ్వవిద్యాలయం నిర్వహించాయి.

కొవిడ్ టీకాల ప్రయోజనాల గురించి ది లాన్సెట్‌ పరిశోధన చాలా బలంగా చెబుతోందని హెచ్‌డీఆర్‌ యూకే ప్రతినిధి  వెల్లడించారు. జూన్‌ 2022 నాటికి ఇంగ్లాండ్‌లో 45.7 శాతం మంది, ఉత్తర ఐర్లాండ్‌లో 49.8 శాతం మంది, స్కాట్లాండ్‌లో 34.2 శాతం మంది, వేల్స్‌లో 32.8 శాతం మంది మాత్రమే టీకాలు వేయించుకున్నట్లు తేలింది. 2022 జూన్‌-సెప్టెంబర్‌ మధ్యలో 40వేల393 మందిలో కొంతమంది కొవిడ్‌ వల్ల చనిపోవడం..మరికొంతమంది ఆస్పత్రుల్లో చేరడం జరిగింది. కానీ యూకేలో పూర్తిగా టీకాలు వేసినట్లైతే.. వీరిలో 7,180 మందికి ఈ పరిస్థితి ఎదురయ్యేది కాదని అధ్యయనకర్తలు చెప్పారు.

యూకేలో 40,393 మందిలో 14,156 మంది ఒక్క డోసు మాత్రమే తీసుకున్నట్లు గుర్తించారు.  ఈ కొవిడ్‌ బారిన పడిన వాళ్లలో అన్ని వయసుల వాళ్లు ఉన్నట్లు పరిశోధకులు తేల్చారు. అయితే కొవిడ్ 19 ప్రభావం వృద్ధులపై ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ‘కొవిడ్‌ టీకా ప్రాణాలు కాపాడటంలోనూ, కొత్త వేరియంట్లు వచ్చినప్పుడు ఎదుర్కోవడంలోనూ పనికొస్తుందని ఈ పరిశోధన తేల్చింది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ రకంగా జరిగిన తొలి పరిశోధన ఇదేనని అధ్యయన కర్తలు చెబుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight − eight =