ఈ వీక్ ఎలిమినేట్ అయ్యేది ఆమేనట.. ఓంకార్, బిగ్ బాస్ ఇండైరక్టుగా ఆమె పేరు చెప్పారా?

Thats The One Who Will Be Eliminated This Week, Eliminated This Week, Avinash, Bigg Boss House, Gautham Krishna, Nabeel, Nikhil, Prerna, Prithvi, Rohini, Sekhar Master, Tasty Teja, Yashmi, Bigg Boss Elimination, Elimination In This Week,Bigg Boss Telugu 8, Bigg Boss Telugu Season 8, Bigg Boss 8, Bigg Boss Contestants, Bigg Boss Season 8, Movie News, Latest Bigg Boss News, Bigg Boss News Updates, Nagarjuna, Tollywood, Mango News, Mango News Telugu

బిగ్ బాస్ సీజన్ 8 సరిగ్గా మరో వారం రోజుల్లో ముగియబోతుంది. సీజన్ 7 స్థాయిలో బ్లాక్ బస్టర్ సీజన్ గా ఈ సీజన్ నిలబడకపోయినా.. ఉన్నంతలో టీఆర్పీ బాగానే సంపాదించుకుంది. అయితే ఈ 14వ వారంలో ఎలిమినేట్ అవ్వబోయేదెవరు అనే దానిపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. సోషల్ మీడియా పోల్స్ ప్రకారం జబర్ధస్త్ రోహిణి, నబీల్, విష్ణుప్రియలలో ఎవరోఒకరు ఎలిమినేట్ అవ్వబోతున్నారంటూ టాక్ నడుస్తోంది.

అయితే అధికారిక పొలింగ్స్ లో మాత్రం ప్రేరణకి అందరికంటే తక్కువ ఓట్లు పడ్డాయా అంటూ కొత్తగా అనుమానం మొదలైంది. ఎందుకంటే ఈ సీజన్ పూర్తవ్వగానే ఓంకార్ ‘ఇస్మార్ట్ జోడి’ సీజన్ 3 ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ సీజన్ కి సంబంధించిన ప్రోమో టెలికాస్ట్ అవుతుంది. ఓంకార్ తన ప్రతీ సీజన్ లోనూ బిగ్ బాస్ కి వచ్చిన కంటెస్టెంట్స్ జోడీనే తీసుకుంటూ వచ్చాడు.

అలాగే ఈ సీజన్ లో కూడా బిగ్ బాస్ మూడో వారం ఎలిమినేట్ అయిన అభయ్ ని, అతని భార్యని తీసుకున్నాడు. కాగా శుక్రవారం ఎపిసోడ్ లో ఓంకార్ ముఖ్య అతిథిగా విచ్చేసి తన షోని ప్రమోట్ చేసుకుంటూ..ప్రేరణకి తన భర్త శ్రీపాద్ తో కలిసి వచ్చే అవకాశాన్ని కల్పించాడు. అయితే దీనికి కారణం మాత్రం ప్రేరణ చెప్పిన అద్భుతమైన సమాధానమే. ఎందుకంటే శుక్రవారం ప్రేరణకు ఒకరితో కలిసి డ్యాన్స్ చేసే సందర్భం రాగా.. హౌస్ మేట్స్ లో ఒకరిని శ్రీపాద్ లాగా ఊహించుకోమని ఓంకార్ కు చెప్తే, శ్రీపాద్ స్థానాన్ని ఎవ్వరూ తీసుకోలేరని ఆమె సమాధానం చెబుతుంది.

ఈ విషయంలో ప్రేరణ ఓంకార్ కి చాలా నచ్చడంతో..ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తాడు. మీలాంటోళ్ళు ఇలాంటి షోలోకి వస్తే చాలా విలువలు జనాలకు తెలుస్తాయని ఓంకార్ పొగడ్తల వర్షం కురిపిస్తాడు. దీంతో ‘ఇస్మార్ట్ జోడి 3’ లో ప్రేరణ, శ్రీపాద్ జంట పాల్గొనబోతున్నారన్న హింట్ ఇచ్చినట్లే అయింది. ఏ గేమ్ షో కి అయినా కూడా రెండు వారాల ముందే ఎపిసోడ్స్ ని షూట్ చేస్తారు.

ఒకవేళ ఓంకార్ హింట్ ఇచ్చినట్లుగా ప్రేరణ ఈ షోలో పాల్గొంటే వచ్చే వారం ఆమె కచ్చితంగా షూటింగ్ లో పాల్గొనాలి. దీంతో ఈ వారం ప్రేరణ ఎలిమినేట్ అవ్వబోతుందా అనే అనుమానాలు ఆడియన్స్ లో తలెత్తాయి. ఈ వారం ప్రేరణ ఎలిమినేట్ అయ్యి బయటకి వస్తేనే వచ్చే ‘ఇస్మార్ట్ జోడి 3’ మొదటి ఎపిసోడ్ లో ఆమె కనిపిస్తుంది. ప్రేరణ బయటకు వెళ్లబోతుండటంతోనే ముందుగా బిగ్ బాస్ స్పెషల్ గా ఆమె పెళ్లి వీడియో ప్రోమో వేశాడా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ వీక్ ఆమె ఎలిమినేట్ అవ్వబోతుందనే ఉద్దేశ్యంతోనే ఓంకార్ తో ఈ ఆఫర్ ఇప్పించాడా అనే వార్తలు వినిపిస్తున్నాయి.