హౌస్ మేట్స్‌ను తిట్టడమే పనిగా పెట్టుకున్న ప్రేరణ.. నెగిటివిటీని మూట కట్టుకుంటున్న కన్నడ భామ

The Motive Behind The Act Is To Insult The House Mates, The Motive Behind The Act, Insult The House Mates, Prerna Insult The House Mates, Prerna Motive Behind The Act, Bigg Boss Telugu 8, Gautham, Nabeel, Nikhil, Prerna, Prithvi, Rohini, Tasty Teja, Yashmi, Bigg Boss Elimination, Elimination In This Week, Bigg Boss Telugu 8, Bigg Boss Telugu Season 8, Bigg Boss 8, Bigg Boss Contestants, Bigg Boss Season 8, Movie News, Latest Bigg Boss News, Bigg Boss News Updates, Nagarjuna, Tollywood, Mango News, Mango News Telugu

బిగ్ బాస్ సీజన్ 8లో ఈ వారం బిగ్ బాస్ హౌస్ కి మెగా చీఫ్ అయిన ప్రేరణ.. తన ప్రవర్తనతో బోలెడంత నెగటివిటీ ని మూటగట్టుకుంది. ఒక విధంగా చెప్పాలంటే మెగా చీఫ్ అయ్యాక ప్రేరణలో చాలా చేంజ్ వచ్చిందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.ముందే నోరు జారడంలో ఫస్ట్ ఉండే ప్రేరణ.. మెగా చీఫ్ అయ్యాక ఇక నోటికి అడ్డూ అదుపూ లేకుండా పోతుందన్న టాక్ నడుస్తోంది.

ఇంకా చెప్పాలంటే మెగా చీఫ్ అయ్యాక ఆమె గ్రాఫ్ కూడా అమాంతం పడిపోయింది. ఇప్పటి వరకూ టైటిల్ రేస్ లో ఉన్న ఆమె, ఇప్పుడు టాప్ 5 లో అయినా ఉంటుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే టేస్టీ తేజ ప్లేస్ టాప్ 5 లో ఫిక్స్ అయిపోయింది.ప్రేరణ ఈ ప్లేస్ కి రావాలంటే.. చాలా పాజిటివ్ పాయింట్స్ పడాలి కానీ.. తను ఆ అవకాశాన్ని ఆడియన్స్ కి ఇచ్చేలా కనిపించడం లేదు. ప్రేరణతో ఇటీవల కాలం స్నేహం గా ఉంటున్న టేస్టీ తేజపై కూడా ఆమె నోరు జారుతూ ఉండటాన్ని ఆడియన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు.

కిచెన్ ఫ్లోర్‌ని క్లీన్ చేసే బాధ్యతలను ప్రేరణ అవినాష్‌కి ఇచ్చింది. రాత్రి సమయంలో ఫ్లోర్ శుభ్రంగా లేకపోవడంతో అప్పుడే అక్కడికి వచ్చిన తేజకి అవినాష్‌ని పిలవమని అంటుంది ప్రేరణ. అప్పుడు తేజ.. అవినాష్ అన్నతో ఇప్పుడే దీని గురించి మాట్లాడానని..తను రేపు ఉదయం చేస్తానని చెప్పాడని..ఇప్పుడు నువ్వు పిలిచినా అదే చెప్తాడని అంటాడు. అప్పుడు ప్రేరణ కోపంగా ముందు నువ్వు అవినాష్‌ని పిలువమని అంటుంది. దానికి తేజ..తానేమి అసిస్టెంట్ ని కాదు, నీకు పిలవాలని ఉంటే వెళ్లి పిలుచుకో అని ప్రేరణతో అంటాడు.

ఇలా మొదటి నుంచి ప్రేరణతో స్నేహంగా ఉంటున్న టేస్టీ తేజపైన కూడా ప్రేరణ తరచూ నోరు జారడంతో అతను కూడా ఈమెకి నెగటివ్ అయిపోయాడు. చివరికి ఫన్ టాస్క్ జరిగే ముందు, అవినాష్ వల్ల థెర్మో కోల్ బాల్స్ క్రిందకి పడిపోయి రూమ్ మొత్తం చెత్తచెత్తగా అయిపోతుంది. అప్పుడు ప్రేరణ కోపంతో డస్ట్ బిన్లో పడేయొచ్చు కదా, వరస్ట్ ఫెల్లో అని అవినాష్‌ని తిట్టడంతో..అతను ఫీలయ్యి హాల్ లోకి వెళ్లిపోతాడు.

ఆ తర్వాత కిచెన్ రూమ్‌ను శుభ్రం చేస్తున్న ప్రేరణను.. రోహిణి ఫన్నీ టాస్క్ చేయడానికి పిలుస్తుంది. అప్పుడు ప్రేరణ రోహిణిపై చిరాకు పడుతూ తిట్టుకుంటూ హాల్‌లోకి వెళ్లడాన్ని ఆడియన్స్ రిసీవ్ చేసుకోలేకపోయారు. చిరాకుగా ఉన్న ప్రేరణతో అవినాష్ మాట్లాడుతూ ‘ప్రేరణ నువ్వు నా మనసుని గాయపరుస్తున్నావ్. ఇలా అయితే నేను టాస్కులు చేయలేను. ఇందాక కూడా నువ్వు నన్ను వరస్ట్ ఫెల్లో అని అన్నావు, నీకు ఆ విషయం గుర్తుందా అసలు? ఎందుకు నీకంత కోపం, అవసరమా..ఇలా ఉంటే నా మూడ్ కరాబ్ అవుతుంది..నేను టాస్క్ చేయలేనని అంటాడు. దానికి ప్రేరణ క్షమాపణలు చెప్తుంది. అయితే ఇది ప్రేరణ ఇప్పటికైనా తన నోటిని అదుపులో పెట్టుకుంటుందో..అలాగే చెలరేగిపోతుందో చూడాలి మరి.