బెంగళూరు బ్లాస్ట్‌ నిందితులు అలా చిక్కారట..

Bengaluru Blast Accused Are Trapped Like That,The Phone,Key Accused,Bengaluru Blast Accused Are Trapped,Rameswaram Cafe Bomb Blast Case In Bengaluru,Bengaluru,Mango News,Mango News Telugu,Bengaluru Blast,Bengaluru Blast News,Bengaluru Blast Latest News,Bengaluru Blast Updates,Bengaluru Blast Latest Updates,Bengaluru Rameshwaram Cafe Blast,Bengaluru Rameshwaram Cafe,Rameswaram Cafe Bomb Blast Case,Bengaluru Rameshwaram Cafe Blast Case,Bengaluru Cafe Blast LIVE News,Mussavir Hussain Shazib,Adbul Matheen Ahmed Taahaa,NIA Officials,NIA,Rameswaram Cafe blast case

బెంగళూరులోని రామేశ్వరం కెఫే బాంబు పేలుడు కేసు ఘటన జరిగినప్పుడు దేశం మొత్తం ఎంతగా ఉలిక్కిపడిందో అందరికీ తెలిసిన విషయమే. తాజాగా దానికి సంబంధించిన  ఇద్దరు కీలక నిందితులను ఎన్ఐఏ అంటే జాతీయ విచారణ సంస్థ ఇటీవల అరెస్టు చేశారు. మార్చి 1న జరిగిన  ఆ ఘటన తర్వాత పారిపోయిన నిందితులు.. నెలన్నర రోజులుగా వివిధ రాష్ట్రాల్లో తప్పించుకుని తిరిగారు.  35 సిమ్‌లు, ఫేక్‌ ఆధార్‌, డ్రైవింగ్‌ లైసెన్సులు అడ్డం పెట్టుకుని దర్యాప్తు సంస్థలను తప్పుదోవ పట్టిస్తూ గేమ్ లు ఆడారు. కానీ  చివరకు తమ సెల్‌ఫోన్‌ను రిపేర్‌కు ఇచ్చి పోలీసులకు దొరికిపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

కోల్‌కతాలో అరెస్టైన ముసావిర్‌ హుస్సేన్‌ షాజిబ్‌, అబ్దుల్‌ మథీన్‌ అహ్మద్‌ తాహాలను ముందు నుంచీ కూడా ఎన్‌ఐఏ కీలక నిందితులుగా అనుమానిస్తూ వస్తోంది. దాడి తర్వాత పారిపోయిన వీరిద్దరూ  చాలా రాష్ట్రాలు తిరుగుతూ చివరకు పశ్చిమ బెంగాల్‌ చేరుకుని అక్కడ కూడా ఎన్నో హోటల్స్ మారుస్తూ తలదాచుకున్నారు.వీరిద్దరూ సెల్‌ఫోన్లను తరచూ మార్చడమే కాదు..దాదాపు 35 సిమ్‌ కార్డులు వాడారంటే పోలీసులే షాక్ అవుతున్నారు.ఈ నిందితులు కోల్‌కతాలోని ఎస్‌ప్లనేడ్‌ ప్రాంతంలోని కొన్నిరోజులు  ఉండేటప్పుడు వీరిలో ఒక నిందితుడి సెల్‌ఫోన్‌ పని చేయలేదు. దాంతో అక్కడి చాంద్‌నీ చౌక్‌ మార్కెట్లోని ఓ దుకాణంలో ఫోస్ లో సిమ్ కార్డు తీసి తమవంతు జాగ్రత్తలు తీసుకుని మరీ రిపేర్‌కు ఇచ్చారు.

రిపేర్ చేసే సమయంలో..మైక్రోఫోన్‌లో ఏదైనా సమస్య ఉందా అని తెలుసుకోవడానికి  దుకాణం యజమాని.. అతని దగ్గరున్న ఓ సిమ్‌ కార్డును ఆ ఫోన్ లో పెట్టి చూశాడు. అయితే అదే బాంబ్ బ్లాస్ట్ నిందితులను పట్టించడానికి మార్గం అవుతుందని అప్పుడు అతనికీ తెలియదు. అదే రోజు సాయంత్రం నిందితుడు వచ్చి ఫోన్‌ అడిగితే .. ఇంకా రిపేర్‌ కాకపోవడంతో మర్నాడు రమ్మని చెప్పాడు.

కానీ అప్పటికే ఫోన్‌ ఐఎంఈఐ నంబరు ఆధారంగా   ఈ ఇద్దరి నిందుతుల ఫోన్‌ను ట్రాక్‌ చేస్తున్న ఎన్ఐఏ పోలీసులు.. ఆ మొబైల్‌లో  సిమ్‌కార్డు వేయడంతో  వచ్చిన  సిగ్నల్స్‌కు అలర్ట్ అయ్యారు. వెంటనే సిమ్ కార్డ్ సిగ్నల్స్ తో.. ఫోన్‌ ఆచూకీ తెలుసుకుని కోల్ కతా వచ్చి మొబైల్‌ షాప్‌నకు వెళ్లిన ఎన్ఐఏ దర్యాప్తు అధికారులు..రిపేర్ షాపు యజమాని స్టేట్‌మెంట్‌ రికార్డు చేసుకున్నారు.నిందితులలో ఒకడు క్యాప్ పెట్టుకున్నాడని షాపు యజమానితో నిర్దారించుకుని..  చివరకు కోల్‌కతా శివారులో ఉన్న  దిఘా ప్రాంతంలో ఓ చిన్న హోటల్‌లో ఉన్న ఇద్దరు నిందితులను ఎన్ఐఏ పోలీసులు అరెస్టు చేయడం సర్వత్రా చర్చనీయాంశం అయింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 4 =