బౌన్సర్లు వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా చర్చ అసలు బౌన్సర్ల నియామకం, విధులపై ప్రత్యేక నిబంధనలు ఏంటి?

There Is A Lot Of Discussion About The Behavior Of Bouncers, Behavior Of Bouncers, Discussion About The Behavior Of Bouncers, Lot Of Discussion About Bouncers, Bouncers Behavior, Bouncers, Discussions On Bouncers, Mohan Babu Issue, Pushpa 2 Controversy, Specific Rules On The Appointment Of Bouncers, Manchu Family Dispute, Manchu Family Fighting, Tollywood, Tollywood News, Tollywood Latest News, Tollywood Updates,Mango News, Mango News Telugu

సెలబ్రిటీలు అందరూ ప్రయివేటు సెక్యురిటీని నియమించుకుంటున్నారు. ముఖ్యంగా సినిమా హీరోలు బయటకు వచ్చినప్పుడు అభిమానుల తాకిడి నుంచి బయటపడటానికి బౌన్సర్ల నుంచి రక్షణ పొందుతుంటారు. బోల్డంత డబ్బు పోసి మరీ బౌన్సర్లను నియమించుకుంటారు. అయితే ఇటీవల కొందరు బౌన్సర్లు వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదమవుతోంది.

సాధారణంగా పబ్బులు, షాపింగ్ మాల్స్ , ప్రముఖుల పర్యటన సందర్భంగా టిప్ టాప్ గా కనిపిస్తూ…అడ్డొచ్చిన వారందరినీ ఈడ్చిపాడేయడం, ప్రశ్నించిన వారిని చితకబాదడం ….ఇదీ వ్యక్తిగత భద్రత పేరుతో బౌన్సర్లు సాగిస్తున్న అరాచకం. ఈ నేపథ్యంలో అసలు బౌన్సర్ల నియామకం, వారి విధులు ఏమున్నాయన్నది పెద్ద ప్రశ్నగా మారింది. ఇటీవల పుష్ప-2 బెన్‌ఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర…. హీరో అల్లు అర్జున్‌కు రక్షణగా వచ్చిన బౌన్సర్లు అభిమానులను తోసుకెళ్తూ చేసిన హడావుడి తొక్కిసలాటకు కారణమైంది. తాజాగా మంచు కుటుంబం వివాదం నేపథ్యంలో….మోహన్ బాబు, విష్ణు , మనోజ్‌ వర్గాలు బౌన్సర్లను మోహరించారు. వారంతా పరస్పరం ఘర్షణకు దిగడం వివాదాస్పదమైంది.

బౌన్సర్లు పోలీసుల తరహాలో సఫారీ దుస్తులు ధరిస్తుంటారు. కొందరు సూడో పోలీసుల తరహాలో ప్రవర్తిస్తూ దాడిచేస్తున్నారు. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న నకిలీ ఏజెన్సీలు బౌన్సర్ల పేరుతో నేర చరిత్ర ఉన్నవారిని అడ్డగోలుగా నియమించుకుంటున్నాయి. దేహధారుడ్యం, ఎత్తు ఉంటే చాల్లన్నట్లుగా ఎంపిక చేస్తున్నాయి. హైదరాబాద్ లో బౌన్సర్లుగా చలామణి అవుతూ సెటిల్ మెంట్లు చేసేవారు వందల సంఖ్యలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. లక్షల్లో ఆదాయం, ఉచిత ఆహారం, వసతి కల్పించడంతో…..నేరచరిత్ర ఉన్నవారూ దీన్ని ఎంచుకుంటున్నారు.

అయితే బౌన్సర్లు దాడిచేస్తే కేసులు నమోదు చేయవచ్చని పోలీసులు చెబుతున్నారు. వారిని ఎంపిక చేసినవారిని , వారి సేవల్ని పొందుతున్న వారిమీద చర్యలు తీసుకోవచ్చు. వీఐపీ భద్రతలో పాల్గొనేవారు వాకీటాకీలు వాడొచ్చు. వీరు మాత్రం వెళ్లిన ప్రాంతాలను సెల్ ఫోన్లతో చిత్రీకరిస్తుంటారు. యునిఫాం మీద కంపెనీ పేరుతోపాటు , పీఎస్ఎల్ఎన్ లైసెన్సు నెంబరు, దాని పక్కన రాష్ట్రం కోడ్ ఉండాలి. ఈ కోడ్ ను ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీస్ రెగ్యులరేషన్ వెబ్ సైట్ లో తనిఖీ చేస్తే సిబ్బంది వివరాలన్నీ వస్తాయి.

వాస్తవానికి బౌన్సర్ల నియామకం, విధులపై ప్రత్యేక నిబంధనలంటూ లేవు. అసలు బౌన్సర్ల వ్యవస్థ చట్టవిరుద్ధం. ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీస్ రెగ్యులరేషన్ చట్టం- 2005 ప్రకారం వీరిని భద్రతా సిబ్బందిగానే పరిగణించాలి. రిజిస్టర్ అయిన ఏజెన్సీలు నేరచరిత్ర, ప్రవర్తన ఆధారంగానే భద్రతా సిబ్బందిని ఎంపిక చేయాలి. వీరు ప్రవర్తించాల్సిన తీరు , ఇతర అంశాలపై శిక్షణ ఇవ్వాలి. కానీ ఇలాంటి పరిస్థితి ఎక్కడా లేదు.