బిగ్‌బాస్ సీజన్‌కు ఎండ్ కార్డు పడనుందన్న వార్తలతో.. గ్రాండ్ ఫినాలేలో అడుగుపెట్టనున్న టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ ఎవరనే చర్చ జోరుగా సాగుతోంది. మరోవైపు ఈ వీక్ కూడా డబుల్ ఎలిమినేషన్ ఉండనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
మరో పన్నెండు రోజుల్లో ఈ సీజన్ ముగియనుందని.. డిసెంబర్ 15వ తేదీన గ్రాండ్ ఫినాలే జరుగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా టేస్టీ తేజ, పృథ్వీరాజ్ ఇద్దరూ ఎలిమినేట్ అవగా.. ఈ వారం గౌతమ్ కృష్ణ, నిఖిల్, నబీల్, ప్రేరణ,విష్ణుప్రియ, రోహిణిలలో ఇద్దరు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ కానున్నట్లు తెలుస్తోంది.
నబీల్, ప్రేరణలో..ఇద్దరిలో ఒకరికి గ్రాండ్ ఫినాలేలో అడుగుపెట్టే ఛాన్స్ బిగ్ బాస్ ఇచ్చినా కూడా.. డబ్బులు పెట్టి ఫైనల్ చేరుకోవడానికి ఇద్దరూ ఒప్పుకోలేదు. దాంతో వారు కూడా ఎలిమినేషన్స్‌లో నిలవడంతో.. ప్రస్తుతం హౌజ్‌లో ఉన్న ఏడుగురు కంటెస్టెంట్స్‌లో టాప్ 5లో ఎవరుంటారు? ఎవరు టైటిల్ విన్నర్ అవుతారన్న చర్చ నెట్టింట జోరుగా నడుస్తోంది.
ఈ వారం మిడ్‌వీక్‌లో ఓ కంటెస్టెంట్…వీకెండ్‌లో మరో కంటెస్టెంట్ బిగ్‌బాస్ నుంచి బయట వెళతారన్న ప్రచారం జరుగుతోంది. ఈ వారం ప్రేరణ, రోహిణిలలో ఎవరో ఎలిమినేట్ కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. టాప్ ఫైవ్‌లో నిఖిల్, గౌతమ్, అవినాష్, నబీల్, విష్ణుప్రియ ఉంటున్నారన్న వార్తలు చక్కెర్లు కొడుతోంది.
మరోవైపు బిగ్‌బాస్ విన్నర్‌గా నిఖిల్ పేరే ఎక్కువగా వినిపించినా తర్వాత ఈ ప్లేసులో గౌతమ్ కృష్ణ పేరు వినిపిస్తోంది. వైల్డ్ కార్డు ఎంట్రీతో ఎంటర్ అయిన గౌతమ్..ఇప్పుడు అతడికి గట్టి పోటీ ఇస్తున్నాడు. కాకపోతే సోమవారం ఎపిసోడ్‌లో నిఖిల్‌పై గౌతమ్ నోరుజారడంతో మైనస్ అయి.. ఈ వీక్ గౌతమ్ ఓటింగ్ తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.