ఈ వారం డబుల్ ఎలిమినేషన్లో ఇద్దరు కంటెస్టెంట్స్ ఉన్నారన్న టాక్ బాగా వినిపిస్తోంది. అయితే ఈ వీక్ ఓటింగ్‌లో
చివరి రెండు స్థానాల్లో నబీల్, విష్ణు ప్రియ ఉండగా..వీరిద్దరిలో నబీల్ డేంజర్ జోన్‌లో ఉన్నాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. మొన్నటి వరకూ టైటిల్ విన్నర్ రేసులో ఉన్న నబీల్ ఈసారి ఎలిమినేషన్ పేరు ఉండటంతో ఆడియన్స్ షాక్ అవుతున్నారు.అయితే బిగ్ బాస్ హౌస్‌లో వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత.. నబీల్‌లో అంతకు ముందు ఉన్న ఫైర్, ఆట అసలు కనిపించకపోవడం వల్లే ఇలా అతని ఓటింగ్ టర్న్ అయిందన్న టాక్ నడుస్తోంది.
బిగ్ బాస్ సీజన్ 8 ..మరో 2 వారాల్లో ముగియబోతుంది. గత వారం హౌస్ నుంచి యష్మీ ఎలిమినేట్ అవ్వగా.. హౌస్ లో గౌతమ్, ప్రేరణ, అవినాష్, విష్ణుప్రియ, టేస్టీ తేజ, రోహిణి, నిఖిల్, పృథ్వీ, నబీల్ మిగిలారు. ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి డబుల్ ఎలిమినేషన్ ద్వారా వీరిలో ఇద్దరు ఎలిమినేట్ అయి బయటకి రాబోతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి.
సోషల్ మీడియాలో జరుగుతున్న అనధికారిక ఓటింగ్ లెక్కల ప్రకారం చూస్తే గౌతమ్, నిఖిల్ మధ్య ఓటింగ్ పోటాపోటీగా జరుగుతుంది. వీళ్లిద్దరిలో ఎవరు కచ్చితంగా టైటిల్ కొట్టబోతున్నారో అన్న చర్చ సాగుతోంది. వైల్డ్ కార్డ్స్ ఎంట్రీకి ముందు నిఖిల్ క్లియర్ విన్నర్ అని అంతా ఫిక్స్ అయిపోయారు. తర్వాత నబీల్ పేరు వినిపించింది.వైల్డ్ కార్డు కంటెస్టెంట్‌గా గౌతమ్ హౌస్ లోపలకు వచ్చిన తర్వాత సీన్ మొత్తం మారిపోయింది.
ఇక ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ద్వారా పృథ్వీ, అవినాష్, టేస్టీ తేజలలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారని అంతా అనుకున్నారు. కానీ ఈ ముగ్గురు సేఫ్ జోన్ లోనే ఉన్నారట. చివరి రెండు స్థానాల్లో నబీల్, విష్ణు ప్రియ ఉన్నారట.దీంతో నబీల్ డేంజర్ జోన్లోకి రావడంపై నెట్టింట్లో పెద్ద చర్చే సాగుతోంది. అయితే లాస్ట్ వీక్ కూడా నబీల్ డేంజర్ జోన్ లోనే ఉన్నాడట. మరి ఈ వీక్ నబీల్ కొనసాగుతాడో.. బయటకు వెళతాడో చూడాల్సిందే.