జీహెచ్‌ఎంసీలో కరోనా లక్షణాలున్న వారికీ హోం ట్రీట్ మెంట్ కిట్లు : సీఎస్

Telangana CS Orders to Hand over Home Treatment Kits to All Corona Symptomatic Persons in GHMC Area,Mango News,Mango News Telugu,Telangana CS Somesh Kumar,CS Somesh Kumar,Covid Situation,Telangana COVID-19 Report,Covid-19 Updates In Telangana,COVID-19 Cases In Telangana,Telangana Corona Updates,Covid-19 Situation In Telangana,Telangana Covid-19,Call Centres In All Health Facilities In GHMC Limits,Telangana CS Orders,Telangana CS Live,Telangana CS Live Updates,Home Treatment Kits,Home Treatment Kits to All Corona Symptomatic Persons in GHMC,,CM KCR Live,CM KCR News,CM KCR Latest News,Telangana CS Orders Home Treatment Kits to Corona Symptomatic Persons,Telangana Cs Directs To Start Outpatient Clinics

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదివారం నాడు బి.ఆర్.కె.ఆర్ భవన్ నుండి జీహెచ్‌ఎంసీ ప్రాంతాలలో కోవిడ్ పై జోనల్ కమిషనర్లు మరియు జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్లతో టెలి-కాన్ఫరెన్స్ నిర్వహించారు. హైదరాబాద్ నగరంలో నెలకొన్న కోవిడ్ పరిస్థితులను చర్చించి, కోవిడ్ నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రి, పట్టణ ఆరోగ్య కేంద్రం మరియు బస్తీ దవాఖానాల్లో ఔట్ పేషెంట్ క్లినిక్ ను ప్రారంభించాలని ఈ సందర్భంగా సీఎస్ సోమేశ్ కుమార్ డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు. కరోనా రోగలక్షణం వున్న వ్యక్తులందరికీ వారికి హోం ట్రీట్ మెంట్ కిట్లను అందజేయాలని ఆయన ఆదేశించారు.

టెలికాన్పరెన్స్ సందర్భంగా తీసుకున్న నిర్ణయాలు ఇవే:

  • మున్సిపల్ స్టాఫ్, ఎఎన్ఎమ్ మరియు కనీసం ఇద్దరు ఆశా వర్కర్లతో బృందాలను ఏర్పాటు చేయాలి
  • జ్వరం మరియు ఇతర లక్షణాలతో బాధపడుతున్న వ్యక్తులను గుర్తించడానికి బృందాలు ఆ ప్రాంతంలోని ప్రతి ఇంటినీ సందర్శించాలి. ఈ బృందాలు మెడిసిన్ కిట్లను అప్పగిస్తాయి. కరోనా రోగ లక్షణాలున్న వ్యక్తులకు వాటిని ఎలా తీసుకోవాలో సలహా ఇస్తాయి. కరోనా రోగులను అనుసరిస్తూ వారి ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు.
  • అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు మరియు బస్తీ దవాఖానాలలో పరిశుభ్రత డ్రైవ్ చేపట్టడం.
  • దవాఖానాలో పరిశుభ్రమైన పరిస్థితులను నిర్వహించడానికి దవాఖానా ప్రాంగణాన్ని చీకటిప్రదేశాలు లేకుండా కాంతివంతంగా వుంచడానికి వైట్ వాషింగ్ మొదలైన చర్యలు చేపట్టాలి.
  • అన్ని సర్కిల్‌లలో కోవిడ్ కేర్ సెంటర్లను ప్రారంభించాలి

ఈ సమావేశంలో ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్.ఎ.ఎం.రిజ్వి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, వైద్య విద్య డైరెక్టర్ రమేష్ రెడ్డి, ప్రజారోగ్య డైరెక్టర్ జి.శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 2 =