సెప్టెంబర్ 1న బిగ్ బాస్ తెలుగు 8 హోస్ట్ నాగార్జున ఆధ్వర్యంలో గ్రాండ్ గా ప్రారంభమవగా.. బెజవాడ బేబక్క, నాగ మణికంఠ, విష్ణుప్రియ, పృథ్వీరాజ్, యాష్మి గౌడ, ప్రేరణ, నిఖిల్, ఆదిత్య ఓం, అభయ్ నవీన్, సోనియా ఆకుల, నైనిక, శేఖర్ భాషా, కిరాక్ సీత, నబీల్ అఫ్రిది… హౌస్ లోకి ఎంటర్ అయ్యారు.
ఈ సీజన్లో కేవలం 14 మంది మాత్రమే కంటెస్టెంట్స్ లిస్ట్ లో ఉండగా.. విష్ణుప్రియ, ఆదిత్య ఓంతో పాటు ఒకరిద్దరు మాత్రమే తెలిసిన ముఖాలు ఉండటంతో.. కంటెస్టెంట్స్ విషయంలో ఆడియన్స్ బాగా డిజప్పాయింట్ అయ్యారు. ఇక సోమవారం మొదలైన నామినేషన్స్ ప్రక్రియ జరగగా.. ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. విష్ణుప్రియ, నాగ మణికంఠ, బెజవాడ బేబక్క, శేఖర్ భాషా, సోనియా ఆకుల, పృథ్విరాజ్ నామినేషన్స్ లిస్ట్ లో ఉండటంతో.. ఇక ఆడియన్స్ ఓటింగ్ ఆధారంగానే ఎలిమినేషన్ ప్రక్రియ ఈ వీక్ లో ఉండనుంది.
కాగా నామినేషన్ ఓటింగ్ లో అనూహ్య ఫలితాలు వస్తున్నాయట. విష్ణుప్రియ పాపులారిటీ ఉన్న యాంకర్ కమ్ యాక్ట్రెస్ కావడంతో.. పెద్ద మొత్తంలో ఓట్లు పోల్ అయ్యాయట. నలభై శాతానికి పైగా ఓట్లు ఒక్క విష్ణుప్రియకే పోల్ అయ్యాయట. అయితే సెంటిమెంట్ పండించి ఊహించని విధంగా నాగ మణికంఠ రెండో స్థానంలో ఉన్నాడట.
నాగ మణికంఠ సింపతీ గేమ్ ఆడుతున్నాడంటూ ఒకవైపు విపరీతంగా ట్రోలింగ్ నడుస్తున్నా కూడా.. ఆడియన్స్ లో నాగ మణికంఠకు ఫాలోయింగ్ ఉందని ఓటింగ్ ఫలితాలు పరిశీలిస్తే తెలుస్తుంది. ఇక మూడో స్థానంలో నాగ పంచమి సీరియల్ నటుడు పృథ్వీరాజ్ ఉన్నాడట. డేంజర్ జోన్లో సోనియా ఆకుల, బేబక్క, శేఖర్ భాషా ఉన్నట్లు తెలుస్తోంది. స్వల్ప ఓట్ల తేడాతో ఈ ముగ్గురు చివరి మూడు స్థానాల్లో ఉన్నారట.
బేబక్క ఎలిమినేట్ అయ్యే అవకాశమే ఎక్కువ ఉందని ప్రచారం జరుగుతుంది. అయితే ఆమె ప్రవర్తన, మాట తీరు పరిపక్వంగా ఉన్నాయంటూ. ఏడుపులు, పెడబొబ్బలు వంటి డ్రామాలకు దూరంగా ఉంటుందంటూ ఆడియన్స్ లో ఆమెకు పాజిటివిటీ నెలకొనడంతో కాస్త అటూఇటూగా ఓటింగ్ ప్రక్రియ ఉంది.అదే సమయంలో సోనియా ఆకులపైనా కొంత నెగిటివిటీ ఉన్నట్లు తెలుస్తోంది.ఇక శేఖర్ బాషా తనదైన కామెడీ చేసే ప్రయత్నం చేస్తుండగా.. కొందరు కుళ్లు జోక్స్ అని ట్రోల్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఈ సీజన్ లో కామెడీ మీద దృష్టి పెట్టిన ఏకైన కంటెస్టెంట్ అని పొగుడుతున్నారు.