గ్రాండ్ ఫినాలేలో ఊహించని సర్ప్రైజ్ లు.. టాప్ 3 కంటెస్టెంట్స్ కి బంపర్ ఆఫర్స్!

Unexpected Surprises In The Grand Finale, Surprises In The Grand Finale, Bigg Boss Grand Finale, Unexpected Surprises Bigg Boss Grand Finale, Bigg Boss Finale, Avinash, Bigg Boss House, Gautham Krishna, Grand Finale, Nabeel, Nikhil, Prerna, Prithvi, Rohini, Tasty Teja, Yashmi, Bigg Boss Elimination, Elimination In This Week,Bigg Boss Telugu 8, Bigg Boss Telugu Season 8, Bigg Boss 8, Bigg Boss Contestants, Bigg Boss Season 8, Movie News, Latest Bigg Boss News, Bigg Boss News Updates, Nagarjuna, Tollywood, Mango News, Mango News Telugu

బిగ్ బాస్ సీజన్ 8 ఇప్పుడు ఫినాలే వీక్ లోకి అడుగుపెట్టేసింది. ఈ సీజన్ పెద్ద బ్లాక్ బస్టర్ కాలేదు కానీ సీజన్ 6 రేంజ్ లో డిజాస్టర్ కూడా కాదన్న టాక్ నడుస్తోంది. 5వ వారం నుంచి వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ రావడంతో.. డిజాస్టర్ దిశగా వెళ్తున్న సీజన్ 8 యావరేజ్ రేంజ్‌లోకి వెళ్లిందని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యంగా గౌతమ్, అవినాష్, టేస్టీ తేజ, రోహిణి వంటి వారు రావడం వల్ల ఈ సీజన్ కి కళ వచ్చిందని, లేకపోతే సీజన్ 6 కంటే కూడా ఇది పెద్ద డిజాస్టర్ అయ్యేదని అంటున్నారు. గౌతమ్ రావడం వల్లే హౌస్ లో గేమ్ మొత్తం చేంజ్ అయ్యిందని లేదంటే అంతకుముందు కన్నడ బ్యాచ్ హవానే నడిచేది. అంతేకాదు గౌతమ్ వల్ల నిఖిల్ & కో బ్యాచ్ గ్రూప్ గేమ్ మొత్తం ఆడియన్స్ కి అర్థమైంది. అలాగే నిఖిల్, గౌతమ్ మధ్య జరిగిన ఫైట్స్ టీఆర్ఫీ పెరగడానికి కూడా కారణం అయ్యాయి.

అదే విధంగా అవినాష్, రోహిణి, టేస్టీ తేజ అందించిన కామెడీతో ఎంటర్టైన్ మెంట్ పెరిగింది. వీరితోనే ఈ సీజన్ లో హాట్ స్టార్ లైవ్ కి అత్యధిక వ్యూయర్షిప్ ,భారీ రెస్పాన్స్ రావడానికి ఈ ముగ్గురే అని అంటున్నారు విశ్లేషకులు. ఆడియన్స్ తో పెద్దగా కనెక్షన్ లేని అవినాష్ టాప్ 5 లోకి వెళ్లడానికి ప్రధాన కారణం అతని ఎంటర్టైన్మెంట్ యాంగిల్ అని అంటున్నారు . ముఖ్యంగా ఈ చివరి వారంలో హాట్ స్టార్ లైవ్ అవినాష్ లేకపోతే ఎవరూ చూడరని అంటున్నారు. అందుకే బిగ్ బాస్ టీం అవినాష్‌ను కావాలనే టాప్ 5లో ఉండేలా చేసిందని అంటున్నారు.

మొత్తంగా 8 వసీజన్ బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఈ ఆదివారం జరగబోతుంది. టైటిల్ విన్నర్ ఓటింగ్స్ శుక్రవారం అర్థ రాత్రి వరకు జరగబోతున్నాయి. ట్రోఫీ నిఖిల్ దక్కించుకుంటాడా, లేకపోతే గౌతమ్ దక్కించుకుంటాడా అనే విషయంపై ఆడియన్స్ లో ఉత్కంఠ నెలకొంది.

మరోవైపు ఈ సీజన్ ఫినాలే చాలా గ్రాండ్ గా నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. క్రిస్మస్ కి హీరో నితిన్ నటిస్తున్న ‘రాబిన్ హుడ్’ మూవీ విడుదల అవ్వబోతున్న సందర్భంగా, నితిన్, శ్రీలీల ముఖ్య అతిథులుగా రాబోతున్నారట. హౌస్ లోపలకు వీళ్లిద్దరు వెళ్లి, ఒక కంటెస్టెంట్ ని ఎలిమినేట్ చేసి బయటకి తీసుకొని రాబోతున్నారట.

వీళ్ళ తర్వాత విక్టరీ వెంకటేష్ కూడా మరో అతిథిగా రాబోతున్నారట. సంక్రాంతికి ఈయన హీరోగా నటిస్తున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే మూవీ విడుదల కాబోతుండటంతో మూవీ ప్రొమోషన్స్ కోసం వెంకటేష్ రాబోతున్నారు. అదే విధంగా బాలయ్య బాబు హీరోగా నటించిన ‘డాకు మహారాజ్’ సినిమా కూడా సంక్రాంతికి రాబోతుండటంతో ఈ చిత్రం ప్రొమోషన్స్ కోసం డైరెక్టర్ బాబీ, ఊర్వశి రౌతేలా రాబోతున్నారు.

అయితే ఇదంతా ఒక ఎత్తయితే చివరిగా బిగ్ బాస్ ట్రోఫీని అందించడానికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా విచ్చేయబోతున్నట్టు పెద్ద ఎత్తున టాక్ నడుస్తోంది. టాప్ 3 కంటెస్టెంట్స్ కు ప్రైజ్ మనీ ఆఫర్స్ కూడా రానున్నాయట.అంతేకాకుండా ఈసారి టైటిల్ విన్నర్ కి మాత్రమే కాకుండా, రన్నర్ కి కూడా ప్రైజ్ మనీ ఇవ్వబోతున్నట్టు జోరుగా టాక్ వినిపిస్తుంది.