రుచితో పాటు ఆరోగ్యానికి కూడా హల్వా

Apart from taste Madugula Halwa is also healthy,Apart from taste Madugula Halwa,Madugula Halwa is also healthy,Why that taste of Madugula Halwa, Madugula Halwam Apart from taste, Halwa is also healthy,Mango News,Unique taste of Madugula halwa,Best Madugula Halwa,Madugula Halwa News,Rich with nutrients,Tasty Madugula Halwa,Andhras Madugula halwa,Healthy Madugula Halwa Latest News
Why that taste of Madugula Halwa?, Madugula Halwam Apart from taste, Halwa is also healthy

ఏపీలో తయారయ్యే మాడుగుల హల్వాకు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉందన్న విషయం చాలా మందికి తెలియదు. స్వీట్ అంటే ఇష్టపడని వారు కూడా మాడుగుల హల్వా అంటే ఎగబడి తింటారు. చాలా చోట్ల మాడుగుల హల్వా పేరుతో అమ్ముతున్నా అక్కడ తయారయిన హల్వా రుచి రాదంటారు ఆ స్వీటు ప్రేమికులు.  జీడిపప్పు అద్దిన ఈ స్వీటు చూడగానే తినాలన్నంత టెంప్టింగ్‌గా ఉంటుంది.  ఒకటిన్నర శతాబ్దం క్రితం ఈ స్వీట్ ప్రస్థానం  మాడుగులలో  మొదలైనట్లు స్థానికులు చెబుతారు.  ప్రస్తుతం ఈ మాడుగుల హల్వా వ్యాపారాన్ని నమ్ముకుని అక్కడ 1500 కుటుంబాలు  జీవిస్తున్నాయి.

20 దేశాలకు పైగా ఈ హల్వా ఎగమతి అవుతుందంటేనే హల్వా క్రేజ్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు, పొలిటికల్ లీడర్స్ చాలామంది ఈ మాడుగుల హల్వాను తెప్పించుకుని మరీ  ఇష్టంగా తింటారు. దాదాపు 140 ఏళ్ల కిందట మాడుగులకి చెందిన దంగేటి ధర్మారావు అనే వ్యక్తి అక్కడ చిన్న స్వీటు షాపు వ్యాపారం ప్రారంభించారు.  కొబ్బరి, ఖర్బూజ, బూడిద గుమ్మడిలతో  తయారుచేసిన హల్వాను అమ్మేవారు. అయితే అక్కడ పోటీ పెరగడంతో.. కొత్త మరో కొత్త రకమైన స్వీట్ ఏమైనా తయారు చేయాలనుకున్నారు. అలా కొద్ద్ది రోజుల తర్వాత స్పెషల్ మాడుగుల హల్వాను కనిపెట్టడం అది జనాలకు తెగ నచ్చేయడంతో ఇక ఈ హల్వా ప్రస్థానం మొదలయింది.

రుచి ఒక్కటే కాదు మాడుగుల హల్వాను తరచూ తింటే లైంగిక సామర్ధ్యం పెరుగుతుందన్న ప్రచారం కూడా ఉంది. అందుకే ఇప్పటికీ ఏపీలో చాలామంది వివాహ కార్యాక్రమాలలో ఫస్ట్ నైట్ కోసం దీన్ని స్పెషల్‌గా తెప్పించుకుంటారు. అలాగే  బాలింతలకు  అవసరం అయిన శక్తి కోసం కూడా మాడుగుల హల్వాను తింటారు.   పాకం  కరెక్టుగా రావడంలోనే  ఈ హల్వాకు అంత టేస్ట్ అంతా ఉంటుందని తయారీ దారులు చెబుతూ ఉంటారు.

ఈ హల్వాను ఎవరుపడితే వాళ్లు చేయలేరట. కనీసం 15, 20 ఏళ్లు అనుభవం ఉన్నవాళ్లే ఈ హల్వా తయారీ  దగ్గర ఉంటారు.  నాలుగు రోజులు కష్టపడితేనే  రుచికరమైన హల్వాను తయారవుతుంది. మాడుగుల హల్వా తయారీకి కట్టెల పొయ్యినే వాడతారు. ముందుగా  గోధుమలను 3 రోజులు నానబెట్టి గ్రైండర్లో రుబ్బి.. గోధుమ పాలను తయారుచేస్తారు.  ఆ పాలను నాలుగో రోజు వరకూ పులియబెట్టి… వాటికి పంచదార,స్వచ్ఛమైన నెయ్యి కలిపి దగ్గరకు మరిగే వరకు ఇనుప కళాయిలో తిప్పుతారు. ఆ పాకాన్ని దించి వాటిపై  జీడిపప్పుతో పాటు బాదం పప్పు కూడా అద్దుతారు. ఇలా తయారయినన హల్వా రుచిలో ఏ మాత్రం తేడా రాకుండా నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − one =