ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం పుష్ప 2 డిసెంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా 11,500 స్క్రీన్లలో విడుదలకు సిద్ధమవుతోంది. పాన్ ఇండియా సినిమాగా రూపొందిన ఈ చిత్రం, పలు వాయిదాల తర్వాత ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా, సినిమాకు మరింత హైప్ కలిగించేందుకు బన్నీ ఆహా ఓటీటీలో ప్రసారమవుతున్న “అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే” కార్యక్రమానికి అతిథిగా హాజరై సందడి చేశారు.
బాలకృష్ణతో చిట్‌చాట్ లో ఆసక్తికరమైన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ, తనదైన శైలిలో బన్నీ కొన్ని విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా బాలయ్య అడిగిన “ఈ తరం హీరోలలో నీకు బాగా ఇష్టమైన హీరో ఎవరు?” అనే ప్రశ్నకు ఆయన చాలా తెలివిగా స్పందించారు.
అల్లు అర్జున్ మాట్లాడుతూ, “అర్జున్ రెడ్డి” సినిమాలో విజయ్ దేవరకొండ నటన తనకు చాలా బాగా నచ్చిందని, ఆ తర్వాత “జాతి రత్నాలు” సినిమాలో నవీన్ పోలిశెట్టి నటనను చూస్తూ కిందపడి నవ్వుకున్నానని చెప్పాడు. అలాగే, “డీజే టిల్లు” సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ తనను బాగా ప్రభావితం చేశాడని, అలాగే ఇటీవల విశ్వక్ సేన్, అడివి శేష్ నటన కూడా తనకు ఎంతో ఇష్టమని తెలిపారు.
ఇలా ఒకే సమయంలో పలు హీరోల పేర్లను చెప్పడంతో బాలయ్య సరదాగా, “ఇందులో కేవలం ఒకరి పేరును మాత్రమే చెప్పవచ్చు” అని అన్నారు. దీనికి బన్నీ సమాధానమిస్తూ, “డీజే టిల్లు” సినిమా చూసిన తర్వాత తనను బాగా ఇంప్రెస్ చేసింది సిద్ధు జొన్నలగడ్డ” అని చెప్పాడు.
సోషల్ మీడియాలో వైరల్
బన్నీ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సిద్ధు జొన్నలగడ్డ అభిమానులు ప్రత్యేకంగా సంబరాలు చేసుకుంటున్నారు. అంతేకాక, బన్నీ చెప్పిన తెలివైన సమాధానం యంగ్ హీరోల ఫ్యాన్స్ కు మరింత ఆనందానిస్తోంది.
పుష్ప 2 హైప్
పుష్ప 1 తెలుగులోకంటే హిందీ భాషలోనే ఎక్కువ విజయాన్ని సాధించగా, రెండో భాగంపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నిర్మితమవుతున్న ఈ చిత్రం దాదాపు రూ. 400 కోట్ల బడ్జెట్‌తో రూపుదిద్దుకుంది. ట్రైలర్‌ను ఈ నెల 17న పాట్నాలో విడుదల చేసేందకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అల్లు అర్జున్ పుష్ప 2 తో ఎంత పెద్ద విజయాన్ని సాధిస్తారా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.