ఆధునిక ప్రపంచంలో ఎవరైన ఏదైనా ఫ్రీగా ఇస్తున్నారంటే ఎవరు నమ్ముతారు చెప్పండి. ఇయ్యాళ్ల రేపు అన్నమే ఎవరు ఫ్రీగా పెడతలేరు. అలాంటిది ఫ్రీగా వినోదాన్ని అందిస్తామంటే కొంత మంది నమ్మి బుక్కయిపోతున్నారు. ఫ్రీ గా వస్తుందని ఆశపడ్డారో మీరు ప్రమాదంలో చిక్కుకున్నట్లే. చట్టవిరుద్ధమైన IPTV సేవలు చౌకగా స్ట్రీమింగ్‌ను అందించవచ్చు.. కానీ అవి స్కామ్, మాల్వేర్, భద్రతా ప్రమాదాల వంటి ప్రమాదాలతో ముడిపడి ఉంటాయ్న విషయాన్ని గమనించాల్సిన అసరముంది. ఫ్రీ అనే మాట ఎంత మంచిగా వినిపిస్తుందో.. దాని వల్ల అంతే దోపిడి జరుగుతోంది. అందుకే చట్టబద్ధమైన స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లకు కట్టుబడి ఉండటం మీ భద్రతకు ఎంత కీలకమో ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరముంది.
వినోదాన్ని అందించే ఓటీటీ ప్లాట్‌ఫాంలు ఎన్ని ఉన్నా.. ఫ్రీ అనగానే మన మనస్సు అటువైపే లాగుతుంది. వాస్తవికత, కొత్తదనంతో వృద్ధి చెందే డిజిటల్-కంటెంట్ స్పేస్‌లో ఫ్రీగా ఇచ్చే వాటిలో ఖచ్చితమంటూ ఏదీ లేదు. అందుకోసమే ఇలాంటి వాటిని ఉపయోగించి అక్రమ ఐపీటీవీ (Internet Protocol television)లు రెచ్చిపోతున్నాయి. దీంతో చాలామంది ఎంటర్టైన్మెంట్ ను ఫ్రీగా దొరుకుతుందని అలాంటి ప్లాట్‌ఫాంలకు వెళ్లి స్కామ్ ల బారిన పడుతున్నారు. డిజిటల్ రైట్స్ గురించి సరైన అవగాహన లేకుండా అక్రమ IPTV ద్వారా పైరేటెడ్ కంటెంట్‌ను వినియోగిస్తున్నట్లయితే.. మీకో హెచ్చరిక.. మీరు చట్టాన్ని అతిక్రమిస్తున్నట్లే.. ఇది నేరం కూడానూ.. మీ టీవీ వీక్షణ అనుభవం విషయానికొస్తే.. నిజాయితీగా ఉండండి.. ఉండనివ్వండి.. పైరేటెడ్ కంటెంట్ వీక్షకుల సంఖ్య పెరిగినట్లే .. స్కామ్ ల బారిన పడటం కూడా షరామామూలుగా మారుతుంది. చట్టవిరుద్ధమైన IPTV సేవలు చౌక స్ట్రీమింగ్‌ను అందించవచ్చు.. కానీ అవి స్కామ్, మాల్వేర్, భద్రతా ప్రమాదాల వంటి ప్రమాదాలతో ముడిపడి ఉంటాయి.
చట్ట పరిధిలో లేని వాటిని వినియోగించే నైతిక సందిగ్ధతతో పాటు, IPTV సంభావ్య చట్టపరమైన పరిణామాలతో కూడిన అనేక ఇతర సమస్యలతో నిండి ఉంటుంది. YuppTV, Hotstar, Netflix, Amazon, Zee5, SonyLIV, SunNXT, Aha, Colors, ఇతరత్రా రిస్క్ ప్రూఫ్, ప్రీమియం టీవీ వీక్షణ అనుభవానికి హామీ ఇచ్చే చట్టపరమైన సేవలను మాత్రమే ఎంచుకోవడం ఏకైక మార్గం. మన దేశంలో ఈ పైరసీ సమస్యను పరిష్కరించడానికి కృషి జరుగుతోంది. మనం చేయాల్సిందల్లా ఏంటంటే IPTV మోసలకు దూరంగా ఉండండం.. చట్టబద్ధమైన స్ట్రీమింగ్ సేవలకు మాత్రమే కట్టుబడి ఉండండం.
అసలు స్కామ్ ఎలా జరుగుతుందంటే..
పైరేటెడ్ కంటెంట్ చాలా సులభంగా అందరీని ఆకర్షిస్తుంది. ఇంటర్నెట్‌లోని తాజా స్కామ్‌లో IPTV బాక్స్‌లు, యాప్‌లు, వెబ్‌సైట్‌ల ద్వారా OTT ప్లాట్‌ఫారమ్‌లు, ప్రముఖ టీవీ ఛానెల్‌ల నుండి ప్రీమియం కంటెంట్‌ను అందించే అక్రమ స్ట్రీమింగ్ సేవలు ఉన్నాయి. JadooTV, World Max TV, Maxx TV, Vois IPTV, పంజాబీ IPTV, Chitram TV, BOSS IPTV, Tashan IPTV, Real TV, Indian IPTV వంటి ఈ అక్రమ కేటుగాళ్ళు చౌకగా లేదా ఉచిత యాక్సెస్‌ను అధిక-నాణ్యత కంటెంట్‌తో అందిస్తామంటూ వినియోగదారులను వెబ్‌లో ట్రాప్ లో పడేసి ఆకర్షిస్తున్నారు.. ఈ మాయలో చిక్కుకున్న వీక్షకులు అనేక చట్టివిరుద్దమైన పరిణామాలను ఎదుర్కోవల్సి వస్తుంది.
ప్రమాదాలు
ఈ చట్ట విరుద్దమైన స్ట్రీమింగ్ ప్రీమియం వలన మీరు మీ నెలవారీ బిల్లులో కొన్ని రూపాయలను ఆదా చేయవచ్చు.. కానీ, కాని IPTV పైరసీ మీకు చాలా నష్టాన్ని కలిగిస్తుంది. ఇది మోసాలతో పాటు భద్రతా పరమైన ప్రమాదాల బారిన పడేలా చేస్తుంది. మాల్వేర్, వైరస్‌లు, డేటా ఉల్లంఘనలకు గురవుతారు. మీ పేరు, ఇమెయిల్ చిరునామా, క్రెడిట్ కార్డ్ వివరాల వంటి వ్యక్తిగత సమాచారం దొంగిలించబడవచ్చు.. దుర్వినియోగం చేయబడవచ్చు.. ఇది గుర్తింపు దొంగతనం.. ఆర్థిక మోసానికి దారి తీస్తుంది.
చట్టపరమైన పరిణామాలు..
పైరేటెడ్ కంటెంట్ చూడటం అనైతికమే కాదు చట్టవిరుద్ధం కూడా. భారతదేశం, అమెరికా, బ్రిటన్, ఐరోపా వంటి అనేక దేశాల్లో, IPTV పైరసీలో పాల్గొనడం తీవ్రమైన చట్టపరమైన పరిణామాలకు దారి తీస్తుంది. పైరేటెడ్ కంటెంట్‌ను స్ట్రీమింగ్ లేదా డౌన్‌లోడ్ చేయడం ద్వారా పట్టుబడిన వినియోగదారులు భారీ జరిమానాలు, వ్యాజ్యాలు, నేరారోపణలను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. ఉదాహరణకు, UK ఇప్పటికే పైరేటెడ్ కంటెంట్‌ను యాక్సెస్ చేసినందుకు అనేక మంది వ్యక్తులను ప్రాసిక్యూట్ చేసింది.. ఇది నేరం తీవ్రతను హైలైట్ చేసింది.
కంటెంట్ సృష్టికర్తలకు ఆదాయ నష్టం..
మీరు పైరేటెడ్ కంటెంట్‌ను ఎంకరేజ్ చేస్తూ వీక్షించిన ప్రతిసారి కంటెంట్ సృష్టికర్తలు, ప్రసారకులు, చట్టబద్ధమైన స్ట్రీమింగ్ సేవలు ఆదాయాన్ని కోల్పోతాయి. దీంతో వారు మనుముందు నాణ్యమైన, వైవిధ్యాన్ని కంటెంట్ ను అందించడంలో వారికి ఇది ఏమాత్రం తోడ్పాటునందించదు.
చట్టపరమైన ప్రధాన స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు
IPTV పైరసీతో సంబంధం లేకుండా వినోదాన్ని ఆస్వాదించాలని చూస్తున్న వినియోగదారులకు చట్టపరమైన ఎంపికలు పుష్కలంగా అందుబాటులో ఉన్నాయి. YuppTV, Netflix, Amazon Prime, Hotstar, Zee5, SunNXT వంటి ప్లాట్‌ఫారమ్‌లు టీవీ షోల నుండి సినిమాల వరకు అనేక రకాల కంటెంట్‌ను అందిస్తాయి. ఇవన్నీ చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్‌లో ఉన్నాయి. ఈ చట్టబద్ధమైన సేవలకు సభ్యత్వం పొందడం ద్వారా వీక్షకులు మాల్వేర్ లేదా చట్టపరమైన పరిణామాలకు గురికావడం వంటి చట్టవిరుద్ధ స్ట్రీమింగ్ ప్రమాదాలను నివారించవచ్చు.
అంతేకాకుండా, ఈ చట్టపరమైన ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించడం కంటెంట్ సృష్టికర్తలకు, వినోద పరిశ్రమకు మద్దతు ఇస్తుంది. అధిక-నాణ్యత కంటెంట్ ఉత్పత్తిని కొనసాగించడాన్ని నిర్ధారిస్తుంది. ఇది సురక్షితమైన, మరింత నైతిక ఎంపిక, ఇది కస్టమర్ సేవ, తల్లిదండ్రుల నియంత్రణలు, విశ్వసనీయ స్ట్రీమింగ్ నాణ్యత అదనపు ప్రయోజనాలతో కూడా వస్తుంది. ఈ విషయాలను గమనించి IPTV స్కామ్‌లకు నో చెప్పండి.. అసలైన ఎంటర్టైన్‌మెంట్‌తో ఎంజాయ్ చేయండి.