బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ రోజురోజుకు క్రేజ్ ను పెంచుకుంటూ విజయవంతంగా ప్రసారం అవుతుంది. ఆరో వారం నామినేషన్స్ రచ్చ రచ్చగా జరిగింది. వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన వారంతా నామినేషన్లో పాల్గొనడంతో.. అప్పటి వరకూ ఉన్న బిగ్ బాస్ హౌస్ లోని ఉన్నవాళ్లకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. ఆదివారానికి ముందు ఒక లెక్కఇప్పుడు మరో లెక్క అన్నట్లుగా… వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత లెక్కలు మారాయి.
వైల్డ్ కార్డ్ ఎంట్రీ తర్వాత అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ తో పాటు, టాస్కులు కూడా ఇప్పుడు ఊహించిన స్థాయిలో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో హోటల్ టాస్క్ కొనసాగుతోంది. ఈ టాస్కు పూర్తి స్థాయి ఎంటర్టైన్మెంట్ తో, ఫుల్ జోష్ తో సాగింది. అయితే తాజాగా హౌస్ మేట్స్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది…
బిగ్ బాస్ లో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే నిఖిల్ కనిపించడం లేదేంటి అన్న వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. నిఖిల్ ఏమయ్యాడంటూ పెద్ద చర్చలకు దారి తీస్తోంది. హౌస్ లో లైవ్ స్ట్రీమింగ్ లో జరుగుతున్న టాస్కులో ఎక్కుడ కూడా నిఖిల్ కనిపించలేదు. సుమారు రెండు, మూడు గంటల పాటు సాగిన ఈ లైవ్ లో నిఖిల్ మాత్రం ఎక్కడా కనిపించకపోవడంతో.. ఆడియన్స్, నిఖిల్ ఏమయ్యాడంటూ నెట్టింట్లో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
తనకు ఏదైనా ముఖ్యమైన పని ఉండడం వల్ల బిగ్ బాస్ ని నిఖిల్ రిక్వెస్ట్ చేసుకొని బయటకి వెళ్లాడా? లేదా ఆడియన్స్ కళ్లు కప్పి రహస్యంగా నిఖిల్ ని బయటకి పంపించారా అని సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు పెడుతున్నారు. గత సీజన్ లో శివాజీని ఎస్కేప్ చేసినట్లు ఇప్పుడు కూడా నిఖిల్ ను ఎస్కేప్ చేశారా అన్నది తెలియాల్సి ఉంది.
బిగ్ హౌస్ లో స్ట్రాంగ్ గా ఉన్నవాళ్లలో నిఖిల్ పేరే మొదటి నుంచీ వినిపిస్తుంది. మామూలుగా మిడ్ వీక్ ఎలిమినేషన్ పేరుతో నిఖిల్ ని ఎలిమినేట్ చేసి సీక్రెట్ రూమ్ కి పంపుతారేమో అన్న అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. సీక్రెట్ రూమ్ ని ఈ సీజన్ సిద్ధం చేసిపెట్టినట్లు చాలా రోజుల నుంచి టాక్ నడుస్తుంది.
అయితే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ని దానిలోకి పంపినప్పుడు మాత్రమే సీక్రెట్ రూమ్ సక్సెస్ అవుతుంది.అందుకే నిఖిల్ ను కూడా పంపారా? ఇంకేదైనా సమస్య ఉందా అనేది మాత్రం ఈరోజు ఎపిసోడ్లో తెలుస్తుంది.మరోవైపు ఈ వారం ఎక్కువగా విష్ణు ప్రియా అవుట్ అవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.