బిగ్‌బాస్ సీజన్ 8 నాలుగో వారాన్ని కంప్లీట్ చేసుకుని విజయవంతంగా ఐదో వారంలోకి ఎంటర్ అయిపోయింది. ఫస్ట్ వీక్ బెజవాడ బేబక్క, సెకండ్ వీక్ ఆర్జే శేఖర్ భాషా, మూడో వారం అభయ్ నవీన్ ఎలిమినేట్ కాగా.. నాలుగో వారం ఎవ్వరూ ఊహించని విధంగా సోనియా ఆకుల ఎలిమినేట్ అయింది. ఇక ఐదో వారం నామినేషన్స్‌పైన కూడా ఉత్కంఠ నెలకొంది.
నాలుగో వారం నాగమణికంఠ, సోనియా, నబీల్, ప్రేరణ, ఆదిత్య ఓం, పృథ్వీ నామినేషన్స్‌లో నిలిచారు. శనివారం నబీల్‌ను సేవ్ చేసేసిన నాగార్జున.. ప్రేరణ, మణికంఠ, సోనియా, ఆదిత్య ఓంలలో మణికంఠ డేంజర్ జోన్‌లో ఉన్నాడని చెప్పి ఆదివారం వరకూ టెన్షన్ పెట్టించాడు. హౌస్ మేట్స్ అంతా మణికంఠని జీరో అని స్టాంప్‌లు వేయడంతో వారి నిర్ణయం ప్రకారం.. చివరి వరకు అతనే డేంజర్ జోన్‌లో ఉంటాడని చెప్పాడు.
ఆదివారం నాటి ఎపిసోడ్‌లో సోనియా ఆకుల, ఆదిత్య ఓం, ప్రేరణలలో ముందుగా ప్రేరణను సేవ్ చేసిన నాగ్.. మిగిలిన ముగ్గురిని యాక్షన్ రూంలోకి పిలిచారు. అక్కడి టాస్క్‌ల్లో ఆదిత్య ఓం సేఫ్ అయ్యి మళ్లీ హౌస్‌లో అడుగుపెట్టాడు. చివరికి మణికంఠ, సోనియా మిగలగా.. మరోసారి ఎలిమినేషన్ బాధ్యతను ఇంటి సభ్యుల చేతుల్లోనే పెట్టిన నాగార్జున వారికి 8 సెకన్ల టైమిచ్చాడు. నిఖిల్, పృథ్వీ, నైనిక తప్పించి మిగిలిన ఆరుగురు ఇంటి సభ్యులు కూడా మణికంఠ హౌస్‌లో ఉండాలని ఓట్లు వేయడంతో.. సోనియాను ఎలిమినేట్ చేస్తున్నట్లు ప్రకటించారు.
దీంతోఅందరికీ వీడ్కోలు చెప్పిన సోనియా ఆకుల స్టేజ్ మీదకి చేరుకుంది. ఎలిమినేషన్‌కి ముందుగానే ప్రీపేర్‌గానే ఉన్నానని.. కానీ సేవ్ అవుతానని ఎక్కడో ఉందని నాగ్ తో చెప్పింది సోనియా. తాను ముఖంపై మాట్లాడతాను కాబట్టే తనను ఎక్కువమంది ఇష్టపడరని చెప్పుకొచ్చింది. కానీ తాను ఎప్పుడూ మారలేదని, మారను కూడా అని చెప్పింది. తన కెరీర్‌లో ఎప్పుడూ ఇంత యాక్టీవ్‌గా ఆటలు ఆడలేదని అంది. అందరూ తనను ఏకాకిని చేశారని.. నబీల్, పృథ్వీని స్వీట్ అని మెచ్చుకుని సోనియా హౌస్‌ని వీడింది.
ఆ తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీలపై అధికారికంగా చెప్పిన నాగార్జున.. ఈ మిడ్ వీక్‌లో ఓ ఎలిమినేషన్ ఉంటుందని మరో బాంబు పేల్చి ఆడియన్స్ కు షాక్ ఇచ్చాడు. అయితే ఇప్పటికే ఐదో వారం ఓ మినీ లాంచింగ్ ఈవెంట్ ఉంటుందని సోషల్ మీడియాలో ఇప్పటికే జోరుగా ప్రచారం జరుగుతోంది.
14 మందితో ప్రారంభమైన బిగ్‌బాస్ సీజన్ 8లో నలుగురు ఎలిమినేట్ అవడంతో.. ఐదో వారం వచ్చేసరికి హౌస్‌లో 10 మంది మిగిలారు.
మరోవైపు ఎప్పటిలాగే సోమవారం నామినేషన్స్ తారాస్థాయిలో జరిగినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఐదో వారానికి గాను ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేషన్స్‌లో ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి ఆదిత్య ఓం, నబీల్, నిఖిల్, మణికంఠ, విష్ణుప్రియ, నైనికలో..ఈ వీక్ ఎవరు బయటకు వెళ్తారో వేచి చూడాల్సిందే.