బిగ్ బాస్ సీజన్ 8 మరికొద్ది రోజుల్లోనే ముగియనుండటంతో..బిగ్ బాస్ టైటిల్ ఎవరు కొడతారు?.. ఈ సీజన్ విజేతగా ఎవరు నిలుస్తారు అన్న చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. అయితే నిఖిల్, గౌతమ్ లలో ఎవరో ఒకరు ఈ టైటిల్ సాధిస్తారంటూ చాలామంది ఇప్పటికే ఫిక్స్ అయిపోయారు.
బిగ్ బాస్ సీజన్ 8 లో గ్రాండ్ ఫినాలేకు టాప్ 5 గా ఆడియన్స్ మెప్పుపొందిన వారే వచ్చారు. అయితే ఈ సీజన్లో అర్హత ఉన్న వారే ఫైనలిస్ట్ లుగా వచ్చారన్న టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే బిగ్ బాస్ సీజన్ 8లో నిఖిల్, గౌతమ్ కృష్ణ, ప్రేరణ, నబీల్, అవినాష్ టాప్ 5లో ఉన్నారు. అయితే వీరందరికలో టైటిల్ రేసులో ఉన్నది మాత్రం.. నిఖిల్, గౌతం.
నిఖిల్ సీజన్ మొదటి నుంచి హౌస్‌లోనే ఉన్నాడు. కానీ గత సీజన్లో వచ్చిన గౌతం కృష్ణ ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తూ హౌస్ లోకి వచ్చాడు. అయితే వచ్చిన రెండో వారమే బిగ్ హౌస్ నుంచి వెళ్లిపోయే పరిస్థితి వచ్చినా.. మణికంఠ రూపంలో లక్ అతడిని ఆపింది. ఎందుకంటే 7వ వారం ఎలిమినేషన్ సమయంలో హౌస్ లో తాను ఉండలేనంటూ మణికంఠ సెల్ఫ్ నామినేట్ చేసుకున్నాడు.
దీంతో ఆ టైం లో ఆడియన్స్ పోల్‌లో లీస్ట్ లో ఉన్న గౌతమ్ సేవ్ అయ్యాడు. మణికంఠ సెల్ఫ్ ఎవిక్షన్ వల్ల అతడిని పంపించి గౌతమ్ ని ఉంచారు. ఐతే అప్పటి నుంచి ప్రతి టాస్క్ లోనూ బెస్ట్ ఇస్తూ వచ్చిన గౌతమ్ కొద్ది రోజుల్లో ఆడియన్స్ కు ఫేవరేట్ కంటెస్టెంట్ అయిపోయాడు. టాస్కులు, నామినేషన్స్ అన్నిటిలో కూడా గౌతమ్ ఆటతీరు, ఆవేశం ఆడియన్స్ కు బాగా నచ్చింది. అందుకే ఎలిమినేట్ అవ్వాల్సిన పొజిషన్ నుంచి టైటిల్ కొట్టేస్తాడు అనే రేంజుకు తమ ఓటింగ్‌తో ఎంకరేజ్ చేస్తూ వచ్చారు.
మరోవైపు ఈ సీజన్ లో కన్నడ వర్సెస్ తెలుగు అనే ఒక ఫైట్ ఒకటి నడుస్తుంది. తెలుగు బిగ్ బాస్లో కన్నడ నుంచి వచ్చిన నటులకు టైటిల్ ఇవ్వడమెందుకని నెట్టింట్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అంతేకాదు నిఖిల్ హౌస్ లోని అమ్మాయిలతో చేసిన పులిహోర కార్యక్రమాలు ఇప్పుడు అతన్ని టైటిల్ రేసుకి దూరం చేసేలా కనిపిస్తున్నాయి.
ఇంతవరకు బిగ్ బాస్ 7 సీజన్లలో ఎవరూ కూడా వైల్డ్ కార్డ్ గా వచ్చి టైటిల్ విన్నర్ అయిందే లేదు. ఒకవేళ గౌతమ్ మాత్రం టైటిల్ గెలిస్తే మాత్రం రికార్డ్ అవుతుంది. గౌతమ్ కూడా ఫ్యామిలీ వీక్ లో అంతా తననూ టాప్ లో పెట్టడంతో.. అప్పటి నుంచి మరింత కాన్ఫిడెంట్ గా ఆడుతున్నాడు. మరికొద్ది రోజుల్లోనే ఎవరు విన్నరో, ఎవరు రన్నరో తేలనుంది కాబట్టి అంతవరకూ వెయిట్ చేయాల్సిందే.