బిగ్‌బాస్ సీజన్ 8లో..ముందుగా యష్మీని రోహిణి నామినేట్ చేసింది. నబీల్, పృథ్వీ మెగా చీఫ్ టాస్కు ఆడినప్పుడు సంచాలక్‌గా ప్రేరణ ఉంది.. తను సంచాలక్‌గా పర్ఫెక్ట్‌గా చేసినా.. నువ్వు మాత్రం తను సరిగా చేయలేదని చెప్పావ్.. అది నాకు నచ్చలేదని రోహిణి చెప్పింది. నేను తను తప్పు చేసిందని చెప్పలేదంటూ యష్మీ అంది. దీనికి తప్పు చేసిందని చెప్పలేదు కానీ నువ్వు తప్పు చేయమని చెప్పావ్ ..సంచాలక్‌గా ఉన్నప్పుడు తనెందుకు హెల్ప్ చేస్తుందంటూ రోహిణి పంచ్ వేసింది.
తర్వాత రోహిణి తన రెండో నామినేషన్ విష్ణుప్రియకి వేసింది. మొదటి వారం చూసినప్పుడు విష్ణు బాగా ఆడుతుందనే ఫీలింగ్ వచ్చింది.. కానీ ఆ రేంజ్ నుంచి తర్వాత కిందకి పడిపోయిందని అంటుంది. తన కాన్సట్రేషన్ వేరే చోట ఉంది ..టాస్కులన్నీ ఆడి ప్రతి దాంట్లో ఎంజాయ్‌మెంట్ వెతుక్కోమని రోహిణి అంది. దీనికి తాను టాస్కుల్లో 100 శాతం ఇవ్వలేదు అనడానికి ఏదైనా ఎగ్జాంపుల్స్ ఇవ్వొచ్చుగా అంటూ విష్ణు అడిగింది. దీంతో అవతల ఆడేది గంగవ్వ.. అయినా మీరు గేమ్ ఓడిపోయారని రోహిణి చెబుతుంది.
ఇక నెక్ట్స్ గంగవ్వ నామినేషన్ వేయడానికి వచ్చి.. మొదటిగా విష్ణుప్రియను నామినేట్ చేస్తుంది. నువ్వు గేమ్ ఆడట్లేదు.. నీకు కాళ్లు చేతులు సక్కగా లేవా.. ఉన్నా మరెందుకు ఆడట్లే.. ఉత్తిగనే కూసుంటున్నావ్ అని గట్టిగా చెబుతుంది. దీనికి అలా లేదు అవ్వా నాకు వచ్చిన దాంట్లో నేను దూకి బాగా ఆడతా.. రేపటి నుంచి నా అల్లరి చూస్తావ్.. అంటూ విష్ణు చెబుతుంది.
తర్వాత యష్మీకి రెండో నామినేషన్ వేసింది గంగవ్వ. మీరు 8 మంది ఉన్నారు.. మేము అంతే ఉన్నాం.. కానీ వచ్చినప్పటి నుంచి మీరు మాతో మాట్లాడటం లేదు.. మీ రూమ్‌కి వచ్చినా పట్టించుకోవడం లేదని చెబుతుంది. మీరే పాలు తాగుతున్నారు.. మమ్మల్ని ఎండబెడుతున్నారు.. అందుకే మిమ్ముల్ని నామినేట్ చేస్తున్నానంటూ గంగవ్వ చెప్పింది. దీంతో యష్మీ..ఫుడ్ డిసెషన్ తన చేతుల్లో లేదని.. మా చీఫ్ ఇవ్వద్దన్నారు కాబట్టి ఇవ్వలేదంటుంది.ఇక మిమ్మల్ని వెల్కమ్ చేయలేనందుకు సారీ.. రోజూ మీతోనే మాట్లాడతానని చెప్పింది.
ఇక అవినాష్.. పృథ్వీని మొదటిగా నామినేట్ చేస్తూ ప్రభావతి టాస్కు.. బెలూన్ టాస్కు తప్ప మీరు ఎక్కడా కనిపించలేదని అంటాడు.గేమ్ అంటే టాస్కు మాత్రమే కాదని అంటాడు పృథ్వీ.. దీంతో మరి ఎందుకొచ్చావ్ నువ్వు చెప్పు అని అవినాష్ అంటే విన్ అవ్వడానికి వచ్చానని పృథ్వీ అన్నాడు. సరే విన్ అవ్వు అయితే అంటూ కౌంటర్ వేశాడు అవినాష్. తర్వాత అవినాష్ కూడా యష్మీని నామినేట్ చేశాడు. దీంతో మొత్తంగా యష్మీకి ఆరు నామినేషన్లు పడినట్లు అయింది. ఈ వారం ఇదే హయ్యస్ట్.