రాష్ట్రంలో ఉచిత కరోనా పరీక్షలు ప్రారంభం

Free Corona Tests, Free Corona Tests in GHMC, Free Corona Tests in GHMC Area, Free Corona Tests in Telangana, free COVID tests, free COVID tests in GHMC, GHMC, Hyderabad, Hyderabad Coronavirus News, telangana, Telangana Coronavirus, Telangana Coronavirus Deaths

తెలంగాణ రాష్ట్రంలో రాబోయే వారం, పదిరోజుల్లో హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలకు చెందిన 30 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 50 వేల మందికి ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నట్లు సీఎం కేసీఆర్ ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు నుంచి తెలంగాణ ప్రభుత్వం కరోనా పరీక్షలు చేయడం ప్రారంభించింది. వనస్థలిపురం, కొండాపూర్‌, సరూర్‌నగర్‌ ఏరియా ఆసుపత్రులు, బాలాపూర్‌ ప్రైమరీ హెల్త్‌కేర్‌ సెంటర్ లలో నేటి నుంచి ఉచితంగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే కరోనా సోకినా వారి కుటుంబ సభ్యులు, వారితో సన్నిహితంగా మెలిగిన వారికి ముందుగా పరీక్షలు నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu