రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్

CM KCR Extended Birthday Greetings to President Ram Nath Kovind, CM KCR extends birthday wishes to President Ram Nath Kovind, KCR Extended Birthday Greetings to President Ram Nath Kovind, Mango News, PM Modi, PM Modi CM KCR Extended Birthday Greetings to President Ram Nath Kovind, PM Modi turns 71, President Kovind turns 76 today, President Ram Nath Kovind, President Ram Nath Kovind turns 76, Ram Nath Kovind, RamNath Kovind Birth Day

భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పుట్టిన రోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సహా పలువురు గవర్నర్లు, ముఖ్యమంత్రులు, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేస్తూ “రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన వినయపూర్వకమైన వ్యక్తిత్వం కారణంగా, మొత్తం దేశం చేత గౌరవించబడ్డారు. సమాజంలోని పేద మరియు అట్టడుగు వర్గాల సాధికారతపై ఆయన దృష్టి ఆదర్శప్రాయమైనది. ఆయన దీర్ఘ మరియు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలి” అని పేర్కొన్నారు.

అలాగే రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పుట్టిన రోజును పురస్కరించుకుని, తెలంగాణ ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం కేసీఆర్ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మరిన్ని కాలాలపాటు దేశానికి సేవలు అందించేలా, రాష్ట్రపతికి భగవంతుడు ఆయురారోగ్యాలు, శక్తిని అందించాలని సీఎం కేసీఆర్ ప్రార్థించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 3 =