కరోనాకు శాశ్వత పరిష్కారం వ్యాక్సినేషన్‌ ఒక్కటే: మంత్రి కేటీఆర్

KTR, KTR Inaugurate 100-Bed Hospital, KTR Inaugurates 100 Bed Govt Regional Hospital at Vemulawada, KTR Inaugurates 100 Bed Hospital, KTR inaugurates 100-bed COVID Care Centre, Mango News, Minister for IT, Minister KTR, Minister KTR Inaugurate 100-Bed Hospital In Vemulawada, Minister KTR Inaugurates 100 Bed Govt Regional Hospital, Minister KTR Inaugurates 100 Bed Govt Regional Hospital at Vemulawada, Minister KTR Inaugurates 100 Beds Hospital At Vemulawada, Minister KTR Sircilla Tour, telangana, vemulawada

తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం నాడు వేములవాడ నియోజకవర్గ కేంద్రంలో 100 పడకల ప్రాంతీయ ఆసుపత్రిని ప్రారంభించారు. ప్రజలకు అత్యాధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా రూ.22 కోట్ల వ్యయంతో ఈ ఆసుపత్రిని నిర్మించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, కరోనా సమయంలో కూడా వేగంగా నిర్మాణ పనులను జరిగేలా, సాధ్యమైనంత త్వరగా ఈ ఆసుపత్రి అందుబాటులోకి వచ్చేందుకు అధికారులు కృషి చేశారని చెప్పారు. మరోవైపు ప్రస్తుత పరిస్థితుల్లో కరోనానే కాకుండా బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ వంటి వ్యాధులు వెలుగులోకి వస్తున్నాయని, ఆ బాధితుల కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ, యాంటీ ఫంగల్ మందులను అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని అన్నారు. ప్రజలెవరూ ఈ వ్యాధుల విషయంలో బయపడొద్దని సూచించారు.

కరోనాకు శాశ్వత పరిష్కారం వ్యాక్సినేషన్‌ ఒక్కటే:

కరోనాకు శాశ్వత పరిష్కారం వ్యాక్సినేషన్‌ ఒక్కటేనని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ప్రపంచానికి సరిపడా వ్యాక్సిన్‌ హైదరాబాద్‌ లోనే తయారవుతున్నా, వ్యాక్సిన్ క్యాపిటల్ గా హైదరాబాద్ ఉన్నప్పటికీ మన ప్రజలకు సరిపడినంత వ్యాక్సిన్ అందుబాటులో లేకుండా పోయిందన్నారు. దేశంలో ఉత్పత్తి అవుతున్న వ్యాక్సిన్లలో 85 శాతం కేంద్రం తన ఆదీనంలోకి తీసుకుందని, మిగిలిన 15 శాతంలోనే రాష్ట్ర ప్రభుత్వాలు మరియు ప్రైవేట్ ఆసుపత్రులకు నేరుగా ఇస్తున్నారని అన్నారు. ప్రజలు వ్యాక్సిన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ఒక అసాధారణమైన గ్యాప్ ఏర్పడిందని, వ్యాక్సిన్లకు డిమాండ్ అధికంగా ఉందని, సప్లై మాత్రం తక్కువుగా ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + nineteen =