ఏపీఎస్ ఆర్టీసీ, టీఎస్ ఆర్టీసీల మధ్య నేడు ప్రాథమిక చర్చలు

AP Interstate Bus Services, APSRTC, APSRTC and TSRTC Officials Will Discuss on Interstate Bus Services, APSRTC Interstate Bus Services, Interstate Bus Services, interstate bus services in ap, interstate bus services in telangana, RTC and Interstate bus Services, TSRTC, TSRTC Interstate Bus Services

అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాకే ఆర్టీసీ బస్సులను నడపాలని తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఇటీవల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అలాగే ఒప్పందాలకు సంబంధించిన పక్రియను పర్యవేక్షించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను సీఎం కేసీఆర్ ఆదేశించారు.

ఈ నేపథ్యంలో ఏపీఎస్ ఆర్టీసీ, టీఎస్ ఆర్టీసీల మధ్య అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులపై ఒప్పందాలకు సంబంధించి ఈ రోజు విజయవాడలోని ఆర్టీసీ హౌజ్ లో ప్రాథమిక చర్చలు జరగనున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు ఎన్ని కిలోమీటర్లు తిరుగుతున్నాయి, అలాగే తెలంగాణ ఆర్టీసీ బస్సులు ఏపీలో ఎన్ని కిలోమీటర్ల తిరుగుతున్నాయి వంటి అంశాలపై ఇరు రాష్ట్రాల అధికారులు చర్చించనున్నారు. ముందుగా ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల స్థాయిలోనే చర్చలు జరుగనున్నాయి. అనంతరం రెండు రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులు, ఆర్టీసీ ఎండీలు సమావేశమై తుది నిర్ణయం తీసుకోనున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu