ఆంధ్రప్రదేశ్ కు రూ.3847.96 కోట్లు, తెలంగాణకు రూ.1998.62 కోట్లు విడుదల

1998.62 Cr to Telangana Under Two Installments of Tax Devolution, Central Government, Centre Releases 3847.96 Cr to AP, Centre Releases 3847.96 Cr to AP 1998.62 Cr to Telangana Under Two Installments of Tax Devolution, Centre releases Rs 1998 cr for Telangana, Centre releases two installments of tax devolution, Installments of Tax Devolution, Mango News, Tax Devolution, Tax Devolution from Centre, Telangana to get Rs 1998 crore from Centre, Telangana to get Rs 1998 crore from Centre towards tax Devolution, two installments of tax devolution

కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు నవంబర్ 22న రెండు విడతల పన్ను పంపిణీని విడుదల చేసింది. సాధారణ నెలవారీ డెవల్యూషన్ రూ.47,541 కోట్లు కాగా ఈసారి మొత్తం 28 రాష్ట్రాలకు గానూ 95,082 కోట్లు విడుదల చేసింది. పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు మరియు అభివృద్ధిని మరింత వేగవంతం చేయడానికి రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆర్థిక మంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్‌లతో నవంబర్ 15న కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో ఇచ్చిన హామీ మేరకు కేంద్ర పన్నుల్లో రెండు విడతల రాష్ట్రాల వాటాను విడుదల చేశారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.3847.96 కోట్లు, తెలంగాణ రాష్ట్రానికి రూ.1998.62 కోట్లు విడుదల అయ్యాయి. ఇక అత్యధికంగా ఉత్తర్ ప్రదేశ్ కు రూ.17056.66 కోట్లు, ఆతర్వాత బీహార్ కు రూ.9563.30 కోట్లు విడుదల అయ్యాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + three =