ఇకపై అమెజాన్ ద్వారా మద్యం హోమ్ డెలివరీ, ఆ రాష్ట్రంలో గ్రీన్ సిగ్నల్

Amazon to Start Liquor Home Delivery in West Bengal Soon

ఈ కామర్స్‌ సంస్థల్లో దిగ్గజమైన అమెజాన్‌ ఇకపై మద్యం హోమ్ డెలివరీ సేవలను కూడా అందించనుంది. దేశంలో ముందుగా పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో ఆన్‌లైన్‌ బుకింగ్‌ ద్వారా అమెజాన్ మద్యం హోం డెలివరీ చేయబోతుంది. ఈ మేరకు అమెజాన్‌ సంస్థకు పశ్చిమబెంగాల్ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. పశ్చిమబెంగాల్ రాష్ట్ర బేవరేజెస్ కార్పోరేషన్ తో మద్యం డెలివరీ సేవలకు సంబంధించి అమెజాన్ ఒప్పందం కుదుర్చుకుంది. ‌అలాగే అమెజాన్ తో పాటుగా అలీబాబా గ్రూప్ ఆధ్వర్యంలో నడిచే బిగ్ బాస్కెట్ సంస్థకు కూడా ఆ రాష్ట్రంలో మద్యం హోమ్ డెలివరీ చేయడానికి అనుమతి లభించినట్టుగా తెలుస్తుంది. కొన్ని సంవత్సరాలుగా ఈ-కామర్స్ రంగంలో కీలక సేవలందిస్తున్న అమెజాన్ తమ కార్యక్రమాలను భారత్ లో మరింతగా విస్తరింపజేయాలని భావిస్తున్నట్టు సమాచారం.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu