కరోనా నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, ఉద్యోగులకు కొత్త మార్గదర్శకాలు

Corona Outbreak, Corona Outbreak New Guidelines, Govt Issues New Guidelines to Govt Employees, Guidelines to Govt Employees Amid Corona Outbreak, Telangana Corona Outbreak, Telangana Goverment, Telangana Govt, Telangana Govt Employees, Telangana Govt Issues New Guidelines

తెలంగాణ రాష్ట్రంలో జూన్ 19, శుక్రవారం నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6526 కి చేరిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ముఖ్యంగా జీహెఛ్ఎంసీ పరిధిలో కరోనా‌ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర సచివాలయంతో పాటు వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు సంబంధించి జూన్ 20, శనివారం నాడు ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఉద్యోగులంతా కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. జూన్ 22 నుంచి జులై 4వ తేదీ వరకూ నూతన మార్గదర్శకాలు అమల్లో ఉంటాయని ప్రభుత్వం ప్రకటించింది.

తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన నూతన మార్గదర్శకాలు:

  • ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు తప్ప మిగతా స్టాఫ్‌లో 50 శాతం మాత్రమే హాజరవ్వాలి.
  • రొటేషన్‌ విధానంలో 50శాతం సిబ్బంది మాత్రమే పనిచేయాలి.
  • నాల్గో తరగతి ఉద్యోగులకు వారం విడిచి వారం విధులు.
  • ప్రత్యేక ఛాంబర్స్‌ కలిగిన ఉద్యోగులు ప్రతి రోజు విధులకు హాజరు అవ్వాలి.
  • ముందుగా అధికారుల అనుమతి లేనిదే సందర్శకులను కార్యాలయాల్లోకి అనుమతించకూడదు.
  • విధులకు హాజరుకాని ఉద్యోగులు అందుబాటులో ఉండాలి, హెడ్ క్వార్టర్స్ వదిలి వెళ్ళకూడదు.
  • డ్రైవర్లు పార్కింగ్‌ ప్లేస్‌లో కాకుండా పేషీలో ఉండాలి.
  • కార్యాలయాల్లోని లిఫ్ట్‌ ల్లో ఒక్కసారిగా ముగ్గురే వెళ్ళాలి.
  • గర్భిణీలు, ఇతర వ్యాధులతో బాధపడే ఉద్యోగులు సెలవులను వినియోగించుకోవాలి.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 2 =