తెలంగాణలో పదో తరగతి విద్యార్థులకు గ్రేడ్స్ ఖరారు

SSC 2020 Grades, telangana, Telangana SSC 2020 Grades, Telangana SSC Grades, Telangana SSC-2020 Students Grades Released, TS SSC 2020 Marks Memo, TS SSC 2020 Marks Memo Download, TS SSC Results 2020, TS SSC Results 2020 Marks Memo

తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ వ్యాప్తి‌ నేపథ్యంలో పరీక్షలు లేకుండానే పదోతరగతి చదివిన విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్‌ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. గతంలో పాఠశాలల్లో నిర్వహించిన ఇంటర్నల్ అస్సేస్మెంట్ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా గ్రేడులను కేటాయించి ప్రమోట్ చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పదో తరగతి విద్యార్థులకు గ్రేడ్లు ఖరారు చేశారు. విద్యార్థులకు కేటాయించిన గ్రేడు లకు సంబంధించిన వివరాలను www.bse.telangana.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

పదో తరగతి పరీక్షల కోసం నమోదుచేసుకున్న 5,34,903 మంది విద్యార్థులంతా ఉత్తీర్ణులేనట్టేనని, మార్కుల మెమోలు వారి యొక్క పాఠశాలలలో తీసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. అలాగే గ్రేడ్స్ కు సంబంధించి పాస్‌మెమోల్లో ఏవైనా పొరపాట్లు తలెత్తితే పాఠశాల ప్రధానోపాధ్యాయుల ద్వారా ఎస్ఎస్సీ బోర్డును సంప్రదించాలని మంత్రి సూచించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu