కర్నూలు జిల్లా నంద్యాలలో ఎస్పీవై రెడ్డి ఆగ్రో కెమికల్ పరిశ్రమలో గ్యాస్ లీకేజ్ తో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ పరిశ్రమలో జూన్ 27, శనివారం ఉదయం అమ్మోనియా గ్యాస్ లీకైన సంఘటనలో జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు మృతి చెందారు. గ్యాస్ లీకేజి భయంతో పరిశ్రమలోని కార్మికులంతా ఒక్కసారిగా భయటకు పరుగులు తీశారు. ఈ క్రమంలో కార్మికులు అస్వస్థతకు గురైనట్టు తెలుస్తుంది. సమాచారం అందగానే పోలీసులు, వైద్య, ఫైర్ సిబ్బంది మరియు మండల అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిశ్రమ వద్దకు చేరుకున్న ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు. ఈ ప్రమాదంపై చుట్టుపక్కల స్థానికుల్లో ఆందోళన నెలకొనగా, ప్రమాదానికి గల కారణాలు ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu