రాజమండ్రి వద్ద పట్టాలు తప్పిన గూడ్స్‌ ట్రైన్.. రాకపోకలకు తీవ్ర అంతరాయం, పలు రైళ్లు రద్దు

AP 9 Trains Cancelled Traffic Hit After Goods Carriage Derails at Rajamahendravaram Railway Yard, AP 9 Trains Cancelled, Traffic Hit After Goods Carriage Derails, Rajamahendravaram Railway Yard,Mango News,Mango News Telugu,Rajamahendravaram Railway Station, 9 Trains Cancelled, 9 Trains Cancelled in Rjy,Rajamahendravaram Latest News And Updates,YS Jagan News And Live Updates, YSR Congress Party, Andhra Pradesh News And Updates, AP Politics, Janasena Party, TDP Party, YSRCP, Political News And Latest Updates

రాజమహేంద్రవరం రైల్వే యార్డు వద్ద బుధవారం తెల్లవారుజామున గూడ్స్ రైలు బోగీ పట్టాలు తప్పడంతో చెన్నై-హౌరా ప్రధాన మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో అనేక రైళ్లు పాక్షికంగా మరికొన్ని రైళ్లు పూర్తిగా రద్దు చేయబడ్డాయి. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటన విడుదల చేసింది. వీటిలో విజయవాడ-విశాఖపట్నం సెక్షన్‌లో నడిచే తొమ్మిది ముఖ్యమైన రైళ్లను ఈ రోజు రద్దు చేసింది. మరో మూడు రైళ్లను వేర్వేరు స్టేషన్ల మధ్య పాక్షికంగా రద్దు చేయగా, మరొకటి రెండు గంటలు రీషెడ్యూల్ చేసినట్లు విజయవాడ డివిజన్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ నుస్రత్ తెలిపారు. విజయవాడ-విశాఖపట్నం, విశాఖ-విజయవాడ, గుంటూరు-విశాఖ, విశాఖ-గుంటూరు, విజయవాడ-గుంటూరు, గుంటూరు-విజయవాడ రైళ్లను రద్దు చేసినట్లు చెప్పారు.

కాగా మంగళవారం అర్ధరాత్రి దాటాక 3 గంటలకు మెయిన్ లైన్‌లో రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్‌కు సమీపంలో ఐఎల్టీడీ ప్లైఓవర్ వద్ద గూడ్స్‌ ట్రైన్ పట్టాలు తప్పింది. దీంతో అనునిత్యం ఎంతో రద్దీగా ఉండే చెన్నై-హౌరా మార్గంలో ఒక లైన్ మాత్రమే తెరిచి ఉండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఈ నేపథ్యంలో పట్టాలు తప్పిన రైలుని తప్పించడంతో పాటు ఇతర పునరుద్ధరణ పనుల కోసం విజయవాడ నుండి అధికారుల బృందం సంఘటనా స్థలానికి చేరుకున్నప్పటికీ, ప్రమాదానికి గల కారణాలను వెంటనే కనుగొనలేదని అధికారిక వర్గాలు తెలిపాయి. పట్టాలు తప్పిన బోగీని క్లియర్ చేసిన తర్వాత మధ్యాహ్నానికి లైన్‌ను పునరుద్ధరించే అవకాశం ఉందని రైల్వే వర్గాలు వెల్లడించాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + 1 =