హైదరాబాద్ పాతబస్తీలో 15 రోజుల పాటు స్వచ్చంధంగా దుకాణాలు బంద్‌

Businesses and shops voluntarily close down, Coronavirus store closures, Hyderabad, Hyderabad lockdown news, Old City Lad Bazar, Old City Lad Bazar Traders, Old City Lad Bazar Traders Close Shops, telangana, Telangana News, Traders in Hyderabad shut shops

హైదరాబాద్‌ నగరంలో గత కొన్ని రోజులుగా పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాతబస్తీలోని కొంతమంది వ్యాపారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా 15 రోజుల పాటు దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేయాలని వ్యాపారులు నిర్ణయించారు. దీంతో లాడ్‌ బజార్‌ సహా ఆ ప్రాంతంలో 15 రోజులు దుకాణాలు మూసివేయనున్నారు. మరోవైపు బేగంబజార్‌లోని హోల్‌సేల్‌ కిరాణ దుకాణాలను కూడా జూన్ 28 (ఆదివారం) నుంచి జూలై 5వ తేదీ వరకు స్వచ్ఛంధంగా మూసివేస్తున్నట్లు హైదరాబాద్‌ కిరాణా మర్చంట్‌ అసోసియేషన్ ప్రకటించింది. కాగా తెలంగాణలో జూన్ 26, శుక్రవారం నాటికీ మొత్తం కరోనా కేసుల సంఖ్య 12,349 కి చేరింది. కరోనా నుంచి కోలుకుని 4766 మంది డిశ్చార్జ్ అవ్వగా, 7436 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu