సీబీఎస్ఈ 12వ త‌ర‌గ‌తి ఫ‌లితాలు విడుదల, 88.78 శాతం పాస్

CBSE Class 12th Results-2020 Released Today

సెంట్రల్ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) సోమవారం నాడు 12 వ తరగతి పరీక్షల ఫలితాలను విడుదల చేసింది. పరీక్షకు హాజరైన విద్యార్థుల్లో 88.78 శాతం మంది ఉత్తీర్ణులైన‌ట్లు సీబీఎస్ఈ వెల్ల‌డించింది. ఫలితాలను cbseresults.nic.in వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు.  అలాగే పూర్తి ఫలితాలు అన్ని పాఠశాలలకు కూడా పంపబడ్డాయని తెలిపారు. ఈ సంవత్సరం ప్రతి పాఠశాల కోసం సీబీఎస్‌ఈ సృష్టించిన అధికారిక ఇ-మెయిల్స్ ఐడి లకు ఫలితాలను పంపించినట్టు తెలిపారు. పరీక్షల్లో పాసైన విద్యార్థులకు కేంద్ర మాన‌వ వ‌న‌రుల శాఖ మంత్రి ర‌మేశ్ పోక్రియాల్ శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సీబీఎస్ఈ 12వ తరగతి పెండింగ్‌ పరీక్షలను ఇటీవలే బోర్డు రద్దు చేసిన సంగతి తెలిసిందే. పరీక్షలు రద్దు కావడంతో ఇంటర్నల్ మార్క్స్ ఆధారంగా సీబీఎస్ఈ బోర్డు పరీక్షల ఫలితాలను వెల్లడించింది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu