దేశంలో అత్యధికంగా ఒక్కరోజే 32,695 కరోనా కేసులు, 606 మరణాలు నమోదు

India Positive Cases

భారత్ లో కోవిడ్-19 (కరోనావైరస్) మహమ్మారి మరింతగా విజృంభిస్తుంది. దీంతో దేశవ్యాప్తంగా ప్రతిరోజూ రికార్డ్ స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లోనే కొత్తగా 32,695 కరోనా కేసులు, 606 కరోనా మరణాలు నమోదయ్యాయి. జూలై 16, గురువారం ఉదయానికి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 9,68,876 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలాగే కరోనా మరణాల సంఖ్య 24,915 కి చేరుకుంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నప్పటికీ, కోలుకుంటున్న వారి శాతం ఎక్కువ ఉండడం ఊరట కలిగిస్తుంది. ప్రస్తుతం కరోనా బాధితుల రికవరీ రేటు 63.25 శాతంగా ఉన్నట్టు ప్రకటించారు.

దేశంలో కరోనా కేసులు వివరాలు (జూలై 16, ఉదయం 8 గంటల వరకు) :

దేశంలో మొత్తం పాజిటివ్ కేసులు : 9,68,876
కొత్తగా నమోదైన కేసులు (జూలై 15 – జూలై 16 (8AM-8AM) : 32,695
నమోదైన మరణాలు : 606
డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య : 6,12,815
యాక్టీవ్ కేసులు : 3,31,146
మొత్తం మరణాల సంఖ్య : 24,915

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu