కరోనా సమయంలో ప్రభుత్వం విజయాలు ఇవే, రాహుల్ గాంధీ విమర్శలు

Centre Achievements, Centre Achievements Amid Covid-19 Crisis, national news, PM Modi, rahul gandhi, Rahul Gandhi Latest News, Rahul Gandhi Lists Out Centre Achievements, Rahul Gandhi Political Updates

కాంగ్రెస్ నాయకుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ మోదీ ప్రభుత్వంపై మరోసారి విమర్శలు గుప్పించారు. కరోనా సమయంలో నెలల వారీగా మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలు ఇవేనంటూ కొన్ని అంశాలను పేర్కొంటూ ట్విట్టర్ లో ఎద్దేవా చేశారు. దేశంలో కరోనా కాలంలో నమస్తే ట్రంప్‌ ఈవెంట్‌ నిర్వహణ, మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని కూల్చడం ​సహా ఇతర సంఘటనలను మోదీ ప్రభుత్వ విజయాలుగా పేర్కొన్నారు. ఈ చర్యలతోనే భారత్ కరోనాపై స్వయం సంవృద్ధి సాధించిందని రాహుల్ గాంధీ విమర్శించారు.

రాహుల్ గాంధీ ఈ కింది విధంగా ట్వీట్ చేశారు:

–>కరోనా కాలంలో ప్రభుత్వం సాధించిన విజయాలు:

  • ఫిబ్రవరి – హలో ట్రంప్
  • మార్చ్ – మధ్యప్రదేశ్ లో ప్రభుత్వం కూల్చివేత
  • ఏప్రిల్ – కరోనా పోరులో కొవ్వోతులు వెలిగించడం
  • మే – మోదీ ప్రభుత్వ 6 వ వార్షికోత్సవం
  • జూన్ – బీహార్‌లో వర్చువల్ ర్యాలీ
  • జూలై – రాజస్థాన్ ప్రభుత్వం కూల్చివేసేందుకు ప్రయత్నించడం

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu