మూడు రాజధానులపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం

3 capitals Act, Andhra Pradesh three-capital bills, AP 3 Capitals, AP 3 capitals News, AP Govt Releases Gazette Notifications on 3 capitals, AP News, AP publishes Gazette Notification on 3 Capitals, CRDA Repeal Act, Gazette Notifications on AP 3 capitals

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని వికేంద్రీకరణ(మూడు రాజధానుల బిల్లు), సీఆర్డీఏ రద్దు బిల్లులకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జూలై 31, శుక్రవారం నాడు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. గవర్నర్ ఆమోదంతో ఆ రెండు బిల్లులు చట్టాలుగా మారిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. శుక్రవారం నాడు వెంటనే ఈ రెండు చట్టాలకు సంబంధించి ప్రభుత్వం వేర్వేరుగా గెజిట్‌ నోటిఫికేషన్లను విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటు పక్రియ మొదలు కానుంది. రాష్ట్రంలో కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలు, శాసన రాజధానిగా అమరావతి ఏర్పాటు కానున్నాయి.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu