ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రధాని నరేంద్ర మోదీ

74th Independence Day, Independence Day, Independence Day 2020, PM Modi unfurls the Tricolour flag, pm narendra modi, PM Narendra Modi Unfurls the National Flag, Prime Minister Narendra Modi, Red Fort

74 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు దేశ రాజధాని ఢిల్లీలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముందుగా రాజ్ ఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి నివాళి అర్పించి, ఎర్రకోట వద్దకు చేరుకున్నారు. త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాతీనుద్దేశించి ప్రసంగించారు. దేశ ప్రజలందరికీ 74 వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు నాలుగు వేల మంది అతిధులు అక్కడికి చేరుకున్నారు. అలాగే ఈ వేడుకకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ సహా పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu