మంత్రి హరీష్ రావు కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ

Coronavirus, COVID-19, Finance Minister Harish Rao, Harish Rao, harish rao tested positive, Harish Rao Tests Positive, Harish Rao Tests Positive for Covid-19, Minister Harish Rao, Minister Harish Rao Coronavirus, Telangana Coronavirus, Telangana Finance Minister, Telangana Finance Minister Harish Rao

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, పార్టీల కీలక నాయకులు సైతం కరోనా వైరస్ బారినపడ్డ సంగతి తెలిసిందే. తాజాగా రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు కు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్ వేదికగా స్వయంగా వెల్లడించారు. “కరోనావైరస్ యొక్క ప్రారంభ లక్షణాలు కలగడంతో, నేను పరీక్ష చేయించుకున్నాను. రిపోర్ట్ పాజిటివ్ గా వచ్చింది. నా ఆరోగ్యం బాగానే ఉంది, గత కొద్ది రోజులుగా నాతో సన్నిహితంగా ఉన్న వారు, కలిసిన వారందరూ దయచేసి ఇతరులతో వేరుగా ఉండి, కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని నేను అభ్యర్థిస్తున్నాను” అని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ 4 నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,38,395 కి చేరుకుంది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu