అంతర్వేది ఘటనపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, సీబీఐ దర్యాప్తు కోరుతూ లేఖ

Andhra CM orders CBI inquiry into Antarvedi chariot blaze, Andhra Pradesh, Antarvedi chariot blaze, Antarvedi Temple Incident, Antarvedi Temple Incident CBI Enquiry, AP Govt, AP Govt Seeks CBI Enquiry, CBI Inquiry on Antarvedi Temple Incident, YS Jagan

తూర్పుగోదావరి జిల్లాలోని అంతర్వేదిలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో రథం దగ్ధమైన ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్వేది ఘటనపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి‌ ఆదేశాలు ఇవ్వడంతో, సీబీఐ దర్యాప్తు కోరుతూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు రాష్ట్ర డీజీపీ కార్యాలయం లేఖ పంపింది.

అంతర్వేదిలో జరిగిన ఘటనపై విచారణ జరిపించాలని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ సహా, బీజేపీ, జనసేన పార్టీలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. టీడీపీ అధినేతచంద్రబాబు నాయుడు రాష్ట్రంలో దేవాలయాల్లో జరుగుతున్న ఘటనలపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అలాగే ఈ ఘటనను నిరసిస్తూ ఈ రోజు బీజేపీ, జనసేన పార్టీలు సంయుక్తంగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనబాట పట్టాయి. రెండు పార్టీల యొక్క నేతలు కార్యాలయాల్లో, ఇళ్లల్లో ధర్మ పరిరక్షణ దీక్ష చేపట్టారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu