లక్షణాలుంటే వారికీ మళ్ళీ కరోనా పరీక్ష నిర్వహించాలి

coronavirus india, coronavirus india live updates, Coronavirus India News LIVE Updates, COVID-19 pandemic in India, Health Ministry, Health Ministry Urges States to Retest Symptomatic Negative Cases, India Coronavirus, India Covid-19 Updates, Rapid Antigen Tests, Retest Symptomatic Negative Cases, Retest Symptomatic Negative Cases of Rapid Antigen Tests

కరోనా పరీక్షలకు సంబంధించి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ, భారత వైద్య పరిశోధనామండలి (ఐసీఎంఆర్) ఉమ్మడిగా అన్ని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖలు రాశాయి. ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలో నెగటివ్ వచ్చిన వారిలో, కరోనా లక్షణాలు కనబడుతుంటే వారందరికీ తప్పనిసరిగా ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు చేయించాలని ఆ లేఖలో పేర్కొన్నాయి. ఇలాంటి వ్యక్తులకు పరీక్షలకు నిర్వహించకుండా అలాగే ఉంచితే వైరస్ ను వ్యాప్తి చేసే ప్రమాదం ఉందని హెచ్చరించాయి. అలా మళ్లీ కచ్చితమైన పరీక్షలు జరపటం ద్వారా పొరపాట్లను తొలిదశలోనే గుర్తించి ఆస్పత్రికి తరలించటమో, ఐసొలేషన్ లో ఉంచటమో సాధ్యమవుతుందని పేర్కొన్నాయి. కేవలం విస్తృతంగా అందుబాటులో ఉంచేందుకే ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు తప్ప పూర్తి స్థాయ్తి నిర్థారణకు పనికిరావన్న సంగతి గుర్తించాలని లేఖలో పేర్కొన్నారు. ఆర్టీ-పీసీఆర్ ను మాత్రమే అత్యంత ప్రామాణికమైన కరోనా పరీక్షగా భావించాలని సూచించారు.

ప్రతి జిల్లాలో ఒక అధికారిని లేదా ఒక బృందాన్ని నియమించి పర్యవేక్షణ యంత్రాంగాన్ని నెలకొల్పాలని, ఇలాంటి కేసుల పట్ల చర్యలు తీసుకునేట్టు చూడాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను కోరింది. రోజువారీ ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలను విశ్లేషించి, జిల్లాల వారీగా అన్ని రాష్ట్రాలలో లక్షణాలుండే నెగటివ్ కేసులకు మళ్లీ పరీక్షలు జరిపించి ఎప్పటికప్పుడు పర్యవేక్షించటం, ఎలాంటి ఆలస్యం లేకుండా చూసే బాధ్యత ఈ బృందాలు తీసుకోవాలని చెప్పారు. పాజిటివ్ అయ్యే అవకాశమున్న కేసు ఒక్కటీకూడా గుర్తించని పరిస్థితి లేకుండా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు చూసుకోవాలని చెప్పారు. అలాంటి కేసులకు ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు జరిపిస్తే ఎన్ని పాజిటివ్ లుగా తేలాయో కూడా పర్యవేక్షణ చేయాలని రాష్ట్రాలకు సూచించింది.

ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షల్లో నెగటివ్ వచ్చినవారికి కొన్ని పెద్ద రాష్ట్రాల్లో ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు చేయటం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. దీంతో ఐసీఎంఆర్, కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ ఈ విషయంలో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాయి. ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలలో నెగటివ్ వచ్చాక జ్వరం, దగ్గు, ఊపిరి పీల్చటంలో ఇబ్బంది లాంటి సమస్యలున్న వారికి మరియు ర్యాపిడ్ యాంటెజెన్ పరీక్షల్లో నెగటివ్ చూపించినా రెండు మూడు రోజుల్లోనే లక్షణాలు మొదలైన వారికీ మళ్ళీ ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు చేయాల్సిందేనని మార్గదర్శకాలు విడుదల చేశారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − two =