7 గంటలకు ఇంటి బయటకు వచ్చి వారిని చప్పట్లు కొట్టి అభినందించండి: సీఎం జగన్‌

Andhra Pradesh, AP Appreciate Secretariat Staff and Volunteers with Claps, AP News, Ap Political News, Appreciate Secretariat Staff and Volunteers with Claps In AP, clap for Andhra’s village ward volunteers, Claps Again In Andhra Pradesh, CM YS Jagan Asks People to Appreciate Secretariat Staff and Volunteers with Claps

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత ఏడాది అక్టోబర్ 2 నుంచి రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా గ్రామ, వార్డు సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థను అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థకు నేటితో ఏడాది పూర్తయిన సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ సిబ్బంది అందరికి అభినందనలు తెలిపారు. గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఎలాంటి అవినీతి, లంచాలకు తావు లేకుండా పారదర్శక పద్ధతిలో నేరుగా ప్రజల ఇళ్ల వద్దకే వారు చేరుస్తున్నారని అన్నారు.

గ్రామ స్వరాజ్యం కళ్ల ఎదుటనే కనిపించేలా వీరు సేవలందిస్తున్నారని సీఎం వైఎస్ జగన్ కొనియాడారు. సచివాలయాల సిబ్బంది, గ్రామ, వార్డు వాలంటీర్ల సేవలను గుర్తిస్తూ, వారిని ప్రోత్సహించేలా ప్రజలంతా ఈ రోజు సాయంత్రం 7 గంటలకు ఇంటి నుంచి బయటకు వచ్చి చప్పట్లతో అభినందించాలని సీఎం వైఎస్ జగన్‌ సూచించారు. వారికీ మనమంతా తోడుగా ఉన్నామని చప్పట్లతో సంకేతం ఇవ్వాలని, నేను కూడా సాయంత్రం 7 గంటలకు నా ఇంటి బయటకు వచ్చి చప్పట్లు కొట్టి అభినందిస్తానని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu