స్థానిక సంస్థలకు నిధుల కొరత, సర్పంచుల ఆందోళన అడ్డగింతపై విమర్శలు

Jagan Govt Faces Criticism on Lack of Funds For Local Organizations Concern of Panchayat Sarpanches,Jagan Govt Faces Criticism,Criticism on Lack of Funds,Lack of Funds For Local Organizations,Concern of Panchayat Sarpanches,Jagan Govt on Lack of Funds,Mango News,Mango News Telugu,Jagan Govt Panchayat Sarpanches,YS Jagan government Criticism,Andhra Pradesh faces debt burden,Jagan Govt Latest News,Jagan Govt Latest Updates,Panchayat Sarpanches Latest News,Panchayat Sarpanches Latest Updates,Jagan Govt Lack of Funds Latest News,Jagan Govt Lack of Funds Latest Updates

కేంద్రం నుంచి స్థానిక సంస్థల కోసం వస్తున్న ఆర్థిక సంఘం నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోంది. దాంతో అసలే నిధుల కొరతతో అల్లాడుతున్న పంచాయతీలకు ఇది పెద్ద శాపంగా మారింది. తమకు రావాల్సిన నిధుల కోసం కొంతకాలంగా గ్రామ పంచాయతీ సర్పంచులు ఆందోళన చేస్తున్నారు. చివరకు పంచాయతీరాజ్ కమిషనరేట్ ముట్టడికి యత్నించిన వారిని ప్రభుత్వం అడ్డుకుంది. దీంతో ఏపీ ప్రభుత్వ వ్యవహారశైలి మీద తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తమకు రావాల్సిన నిధుల కోసం నిరసన తెలుపడానికి కూడా అడ్డంకులు సృష్టించి, సర్పంచులను అరెస్ట్ చేయడం మీద పలువురు మండిపడుతున్నారు.

గ్రామ పంచాయతీలకు కేంద్రం 15వ ఆర్థిక సంఘం ద్వారా రూ.988 కోట్ల నిధులు కేటాయించింది. అందులో గ్రామ పంచాయతీలకు రూ.691 కోట్లు దక్కాల్సి ఉంది. వాటిని పిఎఫ్‌ఎంఎస్‌ ద్వారా బ్యాంకు ఖాతాల్లో జమచేయాల్సి ఉంది. కానీ ఏపీ ప్రభుత్వం దానికి విరుద్ధంగా ఆ నిధులను తమ అవసరాల కోసం మళ్లించింది. దాంతో పంచాయతీలు నిర్వహణ ఖర్చుల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. గ్రామాల్లో వీధిదీపాలు, రోడ్లు, డ్రెయిన్లు వంటి సదుపాయాలు కూడా కల్పించలేకపోతున్నామని ఆందోళన పాలకవర్గాల్లో ఉంది.

రెండేళ్లుగా ఈ నిధులు నిలిచిపోయాయి. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు పంచాయతీ పాలకవర్గాల ద్వారా కాకుండా గ్రామసచివాలయ వ్యవస్థ ద్వారా వినియోగిస్తున్నారు. కానీ గ్రామ సచివాలయాల కార్యకలాపాలు, వలంటీర్లు, సిబ్బంది మాత్రం పంచాయతీ పాలకవర్గాల పరిధిలో లేరు. దాంతో స్థానిక సంస్థల ప్రతినిధులకు తీవ్ర అవస్థలు తప్పడం లేదు. అంతేగాకుండా సర్పంచుల గౌరవ వేతనం రూ.3 వేలుగా ఉంది. దానిని 10 ఏళ్లుగా పెంచడం లేదు. మరోవైపు పంచాయతీల పెండింగ్ కరెంటు బిల్లుల పేరుతో ప్రభుత్వం నిధుల్లో కోత పెడుతోంది. కేంద్రం ఇచ్చిన వాటిని మళ్లిస్తూ, స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తోందనే విమర్శలున్నాయి.

ఈ నేపథ్యంలో తాడేపల్లిలో పంచాయతీరాజ్ శాఖ ఆఫీసు ముందు ఆందోళనకు దిగిన సర్పంచులపై పోలీసులను ప్రయోగించారు. పలువురుని అరెస్ట్ చేశారు. ప్రభుత్వం తమ నిధులు తమకు రాకుండా మార్గం మధ్యలో మళ్లిస్తూ తమ గోడు వినిపించే అవకాశం కూడా ఇవ్వలేదని పంచాయతీ సర్పంచుల సంఘం ప్రతినిధులు ఆరోపిస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 2 =