బీబీనగర్ ‌ఎయిమ్స్‌ ను సందర్శించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, పురోగతిపై సమీక్ష

Union Minister Kishan Reddy Visits Bibinagar AIIMS, and Conducted a Review Meeting

తెలంగాణలో యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్‌ ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)‌ను అక్టోబర్ 10, శనివారం నాడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి సందర్శించారు. అనంతరం రోగులకు సదుపాయాలు కల్పించడంలో ఎయిమ్స్‌ పురోగతిపై ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, జిల్లా కలెక్టర్, హాస్పిటల్ స్టాఫ్, ఇతర ఉన్నతాధికారులతో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు కేంద్రప్రభుత్వం అనేక రకాల కార్యక్రమాలు చేపడుతుందని అన్నారు.

ఇప్పటివరకు ఢిల్లీలో మాత్రమే ఉన్న ఎయిమ్స్ హాస్పిటల్ ను, దేశవ్యాప్తంగా 9 చోట్ల ఏర్పాటు చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయించారన్నారు. బీబీనగర్‌ ఎయిమ్స్‌కు రూ.1000 కోట్లు కేటాయించామని, మరిన్ని నిధులు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని చెప్పారు. ఎయిమ్స్ లో పూర్తిస్థాయి సిబ్బంది నియామక ప్రక్రియతో పాటుగా, మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రణాళిక సిద్ధం చేయాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అధికారులకు సూచించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + 19 =