తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షల 10 వేలు దాటింది. అక్టోబర్ 9, శుక్రవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,10,346 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. శుక్రవారం నాడు 50,469 శాంపిల్స్ పరీక్షించగా, 1811 కేసులు నమోదయినట్టు పేర్కొన్నారు. కరోనా వలన మరో 9 మంది మరణించడంతో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 1217 కి పెరిగింది. రాష్ట్రంలో 1,83,025 మంది కరోనా నుంచి కోలుకోగా, ప్రస్తుతం 26,104 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 87.01 శాతానికి చేరుకోగా, మరణాల రేటు 0.57 శాతంగా ఉంది.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(1811):
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu